మామాట లేల వినేవే మగువ నీవు
(॥పల్లవి॥)
మామాట లేల వినేవే మగువ నీవు
వోమి యాతనికే మొక మోడేవు గాని
(॥మామాట॥)
పంతాన రా నని చలపట్టుకొని వుండఁ గాను
యెంతదడ వైనఁ బోర నేలే మాకు
చెంతల నాతఁడే వచ్చి చేయి వట్టి తియ్యఁ గాను
వంతకు నేఁడు నీ విట్టే వచ్చేవు గాని
(॥మామాట॥)
మాట లాడ నని నీవు మౌనముతో నుండఁ గాను
యేఁటికిఁ బెనఁగితియే యిందాఁకా నేము
పాటించి యాతఁడే వచ్చి పక్కన నవ్వితేను
గాఁటపుమచ్చట లాడి కరఁగేవు గాని
(॥మామాట॥)
మంచముపైఁ బవ్వళించి మంతనాన నుండఁ గాను
పొంచి నిన్ను లేప నేలే పొదిగి నేఁడు
అంచెల శ్రీవెంకటేశుఁడదె వచ్చి నిన్నుఁ గూడె
యెంచి యాతనికే చన విత్తువు గాని
(||pallavi||)
māmāḍa lela vineve maguva nīvu
vomi yādanige mŏga moḍevu gāni
(||māmāḍa||)
paṁtāna rā nani salabaṭṭugŏni vuṁḍam̐ gānu
yĕṁtadaḍa vainam̐ bora nele māgu
sĕṁtala nādam̐ḍe vachchi seyi vaṭṭi tiyyam̐ gānu
vaṁtagu nem̐ḍu nī viṭṭe vachchevu gāni
(||māmāḍa||)
māḍa lāḍa nani nīvu maunamudo nuṁḍam̐ gānu
yem̐ṭigim̐ bĕnam̐gidiye yiṁdām̐kā nemu
pāḍiṁchi yādam̐ḍe vachchi pakkana navvidenu
gām̐ṭabumachchaḍa lāḍi karam̐gevu gāni
(||māmāḍa||)
maṁchamubaim̐ bavvaḽiṁchi maṁtanāna nuṁḍam̐ gānu
pŏṁchi ninnu leba nele pŏdigi nem̐ḍu
aṁchĕla śhrīvĕṁkaḍeśhum̐ḍadĕ vachchi ninnum̐ gūḍĕ
yĕṁchi yādanige sana vittuvu gāni