మాకుఁ జూడ వెరగాయ మగువచందము నేఁడు
(॥పల్లవి॥)
మాకుఁ జూడ వెరగాయ మగువచందము నేఁడు
సేకరముగా చలము చెల్లించకుండీనా
(॥మాకుఁ॥)
అందరిలో నిన్ను నేమి ఆడఁజాలకే పో
చెది చెలి పాదానఁ జిమ్మె నిన్నును
ఇందుముఖికోపమెంతో యేకాంతాన నీవుండితే
చిందరవందర పచ్చి సేయకుండీనా
(॥మాకుఁ॥)
సముకాన నిన్ను నిట్టె సంకించలేకెపో
తమితో గొణఁగి తిట్టీ తనలోననె
రమణిమైకాఁక యెంతో రతివేళ నిన్నెంతే
జమళిమై వోసరెల్ల సాదించకుండీనా
(॥మాకుఁ॥)
కడుమొగమోటమునఁ గాదనలేకె పో
తడయక గుట్టుతోడఁ దగఁ గూడెను
యెడయని శ్రీ వేంకటేశ నీపై మోహమెంతో
పడఁతి నీవే తానై భ్రమయించకుండీనా
(||pallavi||)
māgum̐ jūḍa vĕragāya maguvasaṁdamu nem̐ḍu
segaramugā salamu sĕlliṁchaguṁḍīnā
(||māgum̐||)
aṁdarilo ninnu nemi āḍam̐jālage po
sĕdi sĕli pādānam̐ jimmĕ ninnunu
iṁdumukhigobamĕṁto yegāṁtāna nīvuṁḍide
siṁdaravaṁdara pachchi seyaguṁḍīnā
(||māgum̐||)
samugāna ninnu niṭṭĕ saṁkiṁchalegĕbo
tamido gŏṇam̐gi tiṭṭī tanalonanĕ
ramaṇimaigām̐ka yĕṁto radiveḽa ninnĕṁte
jamaḽimai vosarĕlla sādiṁchaguṁḍīnā
(||māgum̐||)
kaḍumŏgamoḍamunam̐ gādanalegĕ po
taḍayaga guṭṭudoḍam̐ dagam̐ gūḍĕnu
yĕḍayani śhrī veṁkaḍeśha nībai mohamĕṁto
paḍam̐ti nīve tānai bhramayiṁchaguṁḍīnā