మాకుఁ జూడ నిదిమేలు మనసు నీ కెట్టున్నదో
(॥పల్లవి॥)
మాకుఁ జూడ నిదిమేలు మనసు నీ కెట్టున్నదో
చేకొని నీకు నితవు చెప్పితిమి నేము
(॥మాకు॥)
వనితపయ్యదలోని వట్రువచన్నుగుబ్బలు
కనుఁగొంటివా వోయి గక్కున నీవు
పెనఁగి నీవురమునఁ బెట్టుకొంటేఁ గనక
చెనకేరతుల నీవు చేసిన భాగ్యము
(॥మాకు॥)
తెలివైనమోము లోని తేనెగా రేయాకెమోవి
తలఁచుకొంటివో లేదో తగిలి నీవు
నెలకొన నీనోరిలో వించుకొంటేఁగనక
తలకొని నీవు సేయుతపము లీడేరును
(॥మాకు॥)
మెచ్చులనలమేల్ మంగమేనిమీఁదివాసనలు
యిచ్చల శ్రీవేంకటేశ యెఱుఁగుదువా
పచ్చిగా నీమేన నిండాఁ బట్టించుకొంటేఁ గనక
అచ్చుగాఁ గూడితి నీకు నమరె వలపులు
(||pallavi||)
māgum̐ jūḍa nidimelu manasu nī kĕṭṭunnado
segŏni nīgu nidavu sĕppidimi nemu
(||māgu||)
vanidabayyadaloni vaṭruvasannugubbalu
kanum̐gŏṁṭivā voyi gakkuna nīvu
pĕnam̐gi nīvuramunam̐ bĕṭṭugŏṁṭem̐ ganaga
sĕnageradula nīvu sesina bhāgyamu
(||māgu||)
tĕlivainamomu loni tenĕgā reyāgĕmovi
talam̐sugŏṁṭivo ledo tagili nīvu
nĕlagŏna nīnorilo viṁchugŏṁṭem̐ganaga
talagŏni nīvu seyudabamu līḍerunu
(||māgu||)
mĕchchulanalamel maṁgamenimīm̐divāsanalu
yichchala śhrīveṁkaḍeśha yĕṟum̐guduvā
pachchigā nīmena niṁḍām̐ baṭṭiṁchugŏṁṭem̐ ganaga
achchugām̐ gūḍidi nīgu namarĕ valabulu