Maagu vimtalaa nee madagamulu

మాకు వింతలా నీ మతకములు
Language

(॥పల్లవి॥)
మాకు వింతలా నీ మతకములు
కైకొని నీవు పుట్టఁగానే పుట్టినవి

(॥మాకు॥)
వద్దు వద్దు మాతోను వట్టి సటలింకా నీకు
పొద్దువోదా ఆపె నీకు బుద్ది చెప్పదా
బద్దులును బాసలును పలుమారు వినయాలు
గద్దరి నీవు పుట్టఁగానే పుట్టినవి

(॥మాకు॥)
యేల యేల సేసేవు యింతలోనే యిచ్చకాలు
వేళలేదా ఆపె నీకు విన్నవించదా
చాలుకొన్న తమకాలు సరసాలు వేసాలు
కాలమందే నీవు పుట్టఁగానే పుట్టినవి

(॥మాకు॥)
మెచ్చు మెచ్చ నన్నింతలో మేకుసేసి కూడితివి
అచ్చు మోపే వాపె నిను నెచ్చరించదా
అచ్చమై శ్రీవేంకటేశ అందికలు పొందికలు
గచ్చుల నీవు పుట్టఁగానే పుట్టినవి

(||pallavi||)
māgu viṁtalā nī madagamulu
kaigŏni nīvu puṭṭam̐gāne puṭṭinavi

(||māgu||)
vaddu vaddu mādonu vaṭṭi saḍaliṁkā nīgu
pŏdduvodā ābĕ nīgu buddi sĕppadā
baddulunu bāsalunu palumāru vinayālu
gaddari nīvu puṭṭam̐gāne puṭṭinavi

(||māgu||)
yela yela sesevu yiṁtalone yichchagālu
veḽaledā ābĕ nīgu vinnaviṁchadā
sālugŏnna tamagālu sarasālu vesālu
kālamaṁde nīvu puṭṭam̐gāne puṭṭinavi

(||māgu||)
mĕchchu mĕchcha nanniṁtalo megusesi kūḍidivi
achchu mobe vābĕ ninu nĕchchariṁchadā
achchamai śhrīveṁkaḍeśha aṁdigalu pŏṁdigalu
gachchula nīvu puṭṭam̐gāne puṭṭinavi