మాకు నీవు వెఱచేవా మాటమాటలా
(॥పల్లవి॥)
మాకు నీవు వెఱచేవా మాటమాటలా
ఆకెఁ బేరుకొనియైనా నానందించేవు గాక
(॥మాకు॥)
తెలతెలవారఁగానే తెఱవమొగముచూచి
వలపు చద్ది గట్టుక వచ్చితివి
చలాన నే నలిగితే జడిసేనా నీవేమైనా
తలపోఁతనైనాఁ గొంత తనుతువుగాక
(॥మాకు॥)
పానుపు దిగుతా నీవు భామమోవి చవిచూచి
తేనెతావులు దప్పికిఁ దెచ్చుకొంటివి
పూని నేఁ బిలువకుంటే పొగిలేవా నీవేమైనా
దానియాసాసలనైనాఁ దనుతువుగాక
(॥మాకు॥)
కన్నులు దెఱచుతానే కాఁగిటిలో నాకెఁ గూడి
అన్నిటా రతిసంబళా లందుకొంటివి
యెన్నఁగ శ్రీవేంకటేశ యెడసేవా నీవేమైనా
తన్నూ నన్నూఁ గూడితివి తనుతువుగాయ
(||pallavi||)
māgu nīvu vĕṟasevā māḍamāḍalā
āgĕm̐ berugŏniyainā nānaṁdiṁchevu gāga
(||māgu||)
tĕladĕlavāram̐gāne tĕṟavamŏgamusūsi
valabu saddi gaṭṭuga vachchidivi
salāna ne naligide jaḍisenā nīvemainā
talabom̐tanainām̐ gŏṁta tanuduvugāga
(||māgu||)
pānubu digudā nīvu bhāmamovi savisūsi
tenĕdāvulu dappigim̐ dĕchchugŏṁṭivi
pūni nem̐ biluvaguṁṭe pŏgilevā nīvemainā
dāniyāsāsalanainām̐ danuduvugāga
(||māgu||)
kannulu dĕṟasudāne kām̐giḍilo nāgĕm̐ gūḍi
anniḍā radisaṁbaḽā laṁdugŏṁṭivi
yĕnnam̐ga śhrīveṁkaḍeśha yĕḍasevā nīvemainā
tannū nannūm̐ gūḍidivi tanuduvugāya