Maagemtigi daamseru marmamulu meelonivi

మాకేఁటికి దాఁచేరు మర్మములు మీలోనివి
Language

(॥పల్లవి॥)
మాకేఁటికి దాఁచేరు మర్మములు మీలోనివి
మేకొన్న రతులకు మీమేనులే గురి

(॥మాకేఁ॥)
పొలఁతికి మీకును పొందులైనందుకు మీ
సెలవినవ్వులలోనిసిగ్గులే గురి
మెలుపుఁదమకములు మిక్కుటమైనందుకు
సొలపుఁగనుసన్నలచూపులే గురి

(॥మాకే॥)
యెందును మీతలపోఁత లీడేరినందుకు
కందువ మీమోములకళలే గురి
అందుకొని మీమనసు లట్టె కరఁగినందుకు
చిందేటిమీచెమటలచిత్తడే గురి

(॥మాకే॥)
వేమరు మీరు వెరచి వెరపుదేరినందుకు
మాముందర మీరాడేమాటలే గురి
యీమేర శ్రీవేంకటేశ నన్ను నేలితివి
ఆమనివేడుకల కొయ్యారాలే గురి

(||pallavi||)
māgem̐ṭigi dām̐seru marmamulu mīlonivi
megŏnna radulagu mīmenule guri

(||māgem̐||)
pŏlam̐tigi mīgunu pŏṁdulainaṁdugu mī
sĕlavinavvulalonisiggule guri
mĕlubum̐damagamulu mikkuḍamainaṁdugu
sŏlabum̐ganusannalasūbule guri

(||māge||)
yĕṁdunu mīdalabom̐ta līḍerinaṁdugu
kaṁduva mīmomulagaḽale guri
aṁdugŏni mīmanasu laṭṭĕ karam̐ginaṁdugu
siṁdeḍimīsĕmaḍalasittaḍe guri

(||māge||)
vemaru mīru vĕrasi vĕrabuderinaṁdugu
māmuṁdara mīrāḍemāḍale guri
yīmera śhrīveṁkaḍeśha nannu nelidivi
āmaniveḍugala kŏyyārāle guri