Maagemti kobamulu magavaaridoda nemdu

మాకేఁటి కోపములు మగవారితోడ నేఁడు
Language

(॥పల్లవి॥)
మాకేఁటి కోపములు మగవారితోడ నేఁడు
చేకొని నీవు నాచెక్కు నొక్కఁగను

(॥వకే॥)
చిత్తము చీఁకటి వాసె సెలవి నీవు నవ్వి
పొత్తుకుఁ బిలిచి బుజ్జగించఁగా
వత్తికి నూనెకు నొక్కవరుసాయ నలుకలు
హత్తి నీవే సేసవెట్టితల్లనాఁడే నాకు

(॥వకే॥)
చలములన్నియుఁ దీరె సరసము నీవాడి
పలుకులనాదరించి పంతమీయఁగా
చలుములు బలుములు సరికి బేసికి ముంచె
నిలిచిన నిలువుకే నీవు మన్నించితివి

(॥వకే॥)
తనువుపై కాఁకమానె దగ్గరఁ బెట్టుక నీవు
కనుచూపులఁ దేలించి కాఁగిలించఁగా
వినయాలు వేడుకలు వీడుదోళ్లాడె నిదె
యెనసితివి శ్రీవేంకటేశ నన్నిపుడు

(||pallavi||)
māgem̐ṭi kobamulu magavāridoḍa nem̐ḍu
segŏni nīvu nāsĕkku nŏkkam̐ganu

(||vage||)
sittamu sīm̐kaḍi vāsĕ sĕlavi nīvu navvi
pŏttugum̐ bilisi bujjagiṁcham̐gā
vattigi nūnĕgu nŏkkavarusāya nalugalu
hatti nīve sesavĕṭṭidallanām̐ḍe nāgu

(||vage||)
salamulanniyum̐ dīrĕ sarasamu nīvāḍi
palugulanādariṁchi paṁtamīyam̐gā
salumulu balumulu sarigi besigi muṁchĕ
nilisina niluvuge nīvu manniṁchidivi

(||vage||)
tanuvubai kām̐kamānĕ daggaram̐ bĕṭṭuga nīvu
kanusūbulam̐ deliṁchi kām̐giliṁcham̐gā
vinayālu veḍugalu vīḍudoḽlāḍĕ nidĕ
yĕnasidivi śhrīveṁkaḍeśha nannibuḍu