మాకేమి చూపేవు మగువ చేఁత లెల్లా
(॥పల్లవి॥)
మాకేమి చూపేవు మగువ చేఁత లెల్లా
నీకు నితవై తేఁ జాలు నేర్చునయ్యా కతలు
(॥॥)
చనవు గలదు గాన సంగడిఁ గూచున్నది
మనసు దెలుఁసు గాన మాట లాడీని
ననిచిన లేమ గాన నవ్వులు నవ్వీ నీతో
చెనకి యేమి సేసినాఁ జెల్లునయ్య ఆపెకు
(॥॥)
తగులమైనది గాన తరితీపు సేసీని
బిగియ నోపుఁగాన పెనఁగీ నీతో
మొగమిచ్చిలాఁడి గాన మోహములు చల్లీని
జిగి నిన్నెంత మీఱినాఁ జెల్లునయ్య ఆపెకు
(॥॥)
కందువ లెఱుఁగుఁ గాన కౌఁగిలించుకొనె నిన్ను
మందెమేళము గనక మలసీ నీతో
అందపు శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
చెందితి నిన్నుఁ బెండ్లాడఁ జెల్లునయ్యా ఆపెకు
(||pallavi||)
māgemi sūbevu maguva sem̐ta lĕllā
nīgu nidavai tem̐ jālu nersunayyā kadalu
(||||)
sanavu galadu gāna saṁgaḍim̐ gūsunnadi
manasu dĕlum̐su gāna māḍa lāḍīni
nanisina lema gāna navvulu navvī nīdo
sĕnagi yemi sesinām̐ jĕllunayya ābĕgu
(||||)
tagulamainadi gāna taridību sesīni
bigiya nobum̐gāna pĕnam̐gī nīdo
mŏgamichchilām̐ḍi gāna mohamulu sallīni
jigi ninnĕṁta mīṟinām̐ jĕllunayya ābĕgu
(||||)
kaṁduva lĕṟum̐gum̐ gāna kaum̐giliṁchugŏnĕ ninnu
maṁdĕmeḽamu ganaga malasī nīdo
aṁdabu śhrī veṁkaḍeśha alamelmaṁganu nenu
sĕṁdidi ninnum̐ bĕṁḍlāḍam̐ jĕllunayyā ābĕgu