Maagemi pani nee marmaalettanu

మాకేమి పని నీ మర్మాలెత్తను
Language

(॥పల్లవి॥)
మాకేమి పని నీ మర్మాలెత్తను
కాకుసేయఁ బనిగద్దా కమ్మటి నీ సుద్దులు

(॥॥)
వొప్పుగొని మోనముతో నూరకే వుండుటే మేలు
చెప్పనేల నీగుణాలు చెలులతోడ
చొప్పువట్టి కన్నులనుఁ జూచుకొంటా నుంటే మేలు
కప్పనేల నీమేని కందువ గురుతులు

(॥॥)
పవ్వళించి పానుపుపై పంతాన నుండుటే మేలు
నవ్వనేల నీచేఁతకు నలుగురిలో
వువ్విళ్ళూర లోలోనే వూఁకొంటానుంటే మేలు
రవ్వ సేయనేల నీరతిలో వినయము

(॥॥)
గద్దించి కాఁగిట నిన్నుఁ గలసినదే మేలు
తిద్దనేల నీనేరాలు దెచ్చి సభలో
వొద్దికై శ్రీవేంకటేశ వొడఁబాట్లివే మేలు
వద్దనఁగనేల నీవుద్దండపు సేఁతలు

(||pallavi||)
māgemi pani nī marmālĕttanu
kāguseyam̐ banigaddā kammaḍi nī suddulu

(||||)
vŏppugŏni monamudo nūrage vuṁḍuḍe melu
sĕppanela nīguṇālu sĕluladoḍa
sŏppuvaṭṭi kannulanum̐ jūsugŏṁṭā nuṁṭe melu
kappanela nīmeni kaṁduva gurudulu

(||||)
pavvaḽiṁchi pānububai paṁtāna nuṁḍuḍe melu
navvanela nīsem̐tagu nalugurilo
vuvviḽḽūra lolone vūm̐kŏṁṭānuṁṭe melu
ravva seyanela nīradilo vinayamu

(||||)
gaddiṁchi kām̐giḍa ninnum̐ galasinade melu
tiddanela nīnerālu dĕchchi sabhalo
vŏddigai śhrīveṁkaḍeśha vŏḍam̐bāṭlive melu
vaddanam̐ganela nīvuddaṁḍabu sem̐talu