Maagele iduvamti mamdemelaalu tanado

మాకేలే ఇటువంటి మందెమేళాలు తనతో
Language

(॥పల్లవి॥)
మాకేలే ఇటువంటి మందెమేళాలు తనతో
మేకొని సేవలుసేసి మెప్పించుటగాక

(॥మాకే॥)
వేడుకకత్తెలకు వేసాలు సేయవచ్చు
చూడఁగానే యెంతైనా సొలయవచ్చు
పాడిపంతా లెంతైనాఁ బచారించఁగవచ్చు
యేడనుఁడైనా తన్ను నెలఇంచవచ్చును

(॥మాకే॥)
కన్నులను జంకించి కాఁతాళించఁగవచ్చు
సన్నలుసేసి వూరకే సాదించవచ్చు
విన్నపాలు సేసిసేసి వేడుకలు రేఁచవచ్చు
చన్నుల నొత్తుచు లోలో జరయఁగవచ్చును

(॥మాకే॥)
చేయరానిచేఁత సేసి చెక్కులు నొక్కఁగవచ్చు
వేయిమాటలైనా నాడి వేఁడుకోవచ్చు
యీయెడ శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
చాయతో నన్నేలె నిఁక సమ్మతించవచ్చును

(||pallavi||)
māgele iḍuvaṁṭi maṁdĕmeḽālu tanado
megŏni sevalusesi mĕppiṁchuḍagāga

(||māge||)
veḍugagattĕlagu vesālu seyavachchu
sūḍam̐gāne yĕṁtainā sŏlayavachchu
pāḍibaṁtā lĕṁtainām̐ basāriṁcham̐gavachchu
yeḍanum̐ḍainā tannu nĕla̮iṁchavachchunu

(||māge||)
kannulanu jaṁkiṁchi kām̐tāḽiṁcham̐gavachchu
sannalusesi vūrage sādiṁchavachchu
vinnabālu sesisesi veḍugalu rem̐savachchu
sannula nŏttusu lolo jarayam̐gavachchunu

(||māge||)
seyarānisem̐ta sesi sĕkkulu nŏkkam̐gavachchu
veyimāḍalainā nāḍi vem̐ḍugovachchu
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
sāyado nannelĕ nim̐ka sammadiṁchavachchunu