Maagelayyaa imta needo maarugonanu

మాకేలయ్యా ఇంత నీతో మారుకొనను
Language

(॥పల్లవి॥)
మాకేలయ్యా ఇంత నీతో మారుకొనను
చేకొని ఇట్టె అందాలు సేసుకొంట గాక

(॥మాకే॥)
చెక్కులపై చెమటలు చిగిరింపుఁ బలకలు
యెక్కడి వనెడిగితే నేమందువొ
ముక్కున నిట్టూరుపులు ముంచిన మోముకళలు
నెక్కొనె నీకనియంటే నీచిత్త మెట్టుండునో

(॥మాకే॥)
కనుఁగొనల నిద్రలు కాయముపై యలపులు
ఘనమాయనంటే నెంత కాఁతాళింతువో
వెనుకొన్న సన్నలును వేవేలు తమకములు
పెనగొనీనంటే యెంత బీరములాడుదువో

(॥మాకే॥)
పెదవిపై వసివాడు పిక్కటిలుఁ బరాకులు
యిదివోయని చూపితే నెంత మెత్తువో
అదన శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
కదిసి గరిసించితే కైవస మెట్టౌదువో

(||pallavi||)
māgelayyā iṁta nīdo mārugŏnanu
segŏni iṭṭĕ aṁdālu sesugŏṁṭa gāga

(||māge||)
sĕkkulabai sĕmaḍalu sigiriṁpum̐ balagalu
yĕkkaḍi vanĕḍigide nemaṁduvŏ
mukkuna niṭṭūrubulu muṁchina momugaḽalu
nĕkkŏnĕ nīganiyaṁṭe nīsitta mĕṭṭuṁḍuno

(||māge||)
kanum̐gŏnala nidralu kāyamubai yalabulu
ghanamāyanaṁṭe nĕṁta kām̐tāḽiṁtuvo
vĕnugŏnna sannalunu vevelu tamagamulu
pĕnagŏnīnaṁṭe yĕṁta bīramulāḍuduvo

(||māge||)
pĕdavibai vasivāḍu pikkaḍilum̐ barāgulu
yidivoyani sūbide nĕṁta mĕttuvo
adana śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
kadisi garisiṁchide kaivasa mĕṭṭauduvo