Maagela yiduvamtivi maganaamdlamu

మాకేల యిటువంటివి మగనాండ్లము
Language

(॥పల్లవి॥)
మాకేల యిటువంటివి మగనాండ్లము
యీ కొలఁది నీకమరు నెమ్మెకాఁడవందురు

(॥వకే॥)
చెక్కు గొరనొత్తకుమీ సిగ్గుతోడిదాన నేను
యిక్కడనే నవ్వేరు నన్నెవ్వరై నాను
నిక్కముగ నివియెల్ల నీచెక్కుల నుంటే మేలు
అక్కడివారు విటుఁడవని నిన్ను నందురు

(॥వకే॥)
తుఱుము వంగఁదియ్యకు దొరపాటిదాన నేను
యెఱఁగకాడుకొనేరు యెవ్వరైనాను
నెఱి నిటువంటివి నీకేఁ గలిగితే మేలు
గుఱిగా రేపల్లెలోని కోడెకాఁడవందురు

(॥వకే॥)
మోవి గంటిసేయకుమీ మొదలి యిల్లాల నేను
శ్రీ వేంకటేశ దూరేరు చెలులెల్లాను
నీవు నన్నుఁ గూడితివి నీకే వుండితే మేలు
భావించి నిన్నెవ్వరైనా బయకాఁడవందురు

(||pallavi||)
māgela yiḍuvaṁṭivi maganāṁḍlamu
yī kŏlam̐di nīgamaru nĕmmĕgām̐ḍavaṁduru

(||vage||)
sĕkku gŏranŏttagumī siggudoḍidāna nenu
yikkaḍane navveru nannĕvvarai nānu
nikkamuga niviyĕlla nīsĕkkula nuṁṭe melu
akkaḍivāru viḍum̐ḍavani ninnu naṁduru

(||vage||)
tuṟumu vaṁgam̐diyyagu dŏrabāḍidāna nenu
yĕṟam̐gagāḍugŏneru yĕvvarainānu
nĕṟi niḍuvaṁṭivi nīgem̐ galigide melu
guṟigā reballĕloni koḍĕgām̐ḍavaṁduru

(||vage||)
movi gaṁṭiseyagumī mŏdali yillāla nenu
śhrī veṁkaḍeśha dūreru sĕlulĕllānu
nīvu nannum̐ gūḍidivi nīge vuṁḍide melu
bhāviṁchi ninnĕvvarainā bayagām̐ḍavaṁduru