Maagela vinnavimcha maabu daamkaa needonu

మాకేల విన్నవించ మాపు దాఁకా నీతోను
Language

(॥పల్లవి॥)
మాకేల విన్నవించ మాపు దాఁకా నీతోను
దాకొని నీవే దయఁదలఁచేవు గాని

(॥॥)
హత్తి రమణి విలిచీ నాడకు విచ్చేయరాదా
చిత్తము వచ్చినట్లాఁజేసేవుగాని
మొత్తమి నిపుడే నీవు మొగము చూడఁగరాదా
యిత్తల నన్నియు నీవే యొఱిఁగేవు గాని

(॥॥)
మనసిచ్చి యేకతాన మాటలాడి చూడరాదా
పనివడి నీవే నిజపట్టేవుగాని
చెనకుచుఁ బానుపుపైఁజేరి కూచుండఁగరాదా
ననిచి మానిజమెల్లా నమ్మేవుగాని

(॥॥)
కక్కసమేఁటికి యాకెఁ గాఁగిలించి కూడరాదా
మిక్కిలి శ్రీ వేంకటేశ మెచ్చేవుగాని
యిక్కువ నిప్పట్టిపొందు యిట్టె యీడేరించరాదా
మక్కువలు నేసి నీవే మరిగేవు గాని

(||pallavi||)
māgela vinnaviṁcha mābu dām̐kā nīdonu
dāgŏni nīve dayam̐dalam̐sevu gāni

(||||)
hatti ramaṇi vilisī nāḍagu vichcheyarādā
sittamu vachchinaṭlām̐jesevugāni
mŏttami nibuḍe nīvu mŏgamu sūḍam̐garādā
yittala nanniyu nīve yŏṟim̐gevu gāni

(||||)
manasichchi yegadāna māḍalāḍi sūḍarādā
panivaḍi nīve nijabaṭṭevugāni
sĕnagusum̐ bānububaim̐jeri kūsuṁḍam̐garādā
nanisi mānijamĕllā nammevugāni

(||||)
kakkasamem̐ṭigi yāgĕm̐ gām̐giliṁchi kūḍarādā
mikkili śhrī veṁkaḍeśha mĕchchevugāni
yikkuva nippaṭṭibŏṁdu yiṭṭĕ yīḍeriṁcharādā
makkuvalu nesi nīve marigevu gāni