మాకేల గరిసించ మాటికి మాటికి నిన్ను
(॥పల్లవి॥)
మాకేల గరిసించ మాటికి మాటికి నిన్ను
జోకతో మీ సరితలు చూచేదే చాలును
(॥॥)
యిందరిలోన ఆపె యేతువలెత్తి యాడఁగా
అందుకు లోఁగేవు నీవంతులోననే
గొందినే నీవాపె మరఁగుఁన జేసిన పనులు
యెందుకు నెక్కనివిఁక నెన్నెన్ని గలవో
(॥॥)
కానిమాటఁలాడి యాపె కన్నుల జంకించఁగాను
మోనాన నున్నాడవిదె మునివలెనే
యే నెపమున నాపెకిచ్చిన మాటపట్లు
అనుకొని చెప్పరానివవి యెటువంటివో
(॥॥)
కగ్గి కాఁగిటిలో నాపె కాంతలఁ దలపించఁగా
సిగ్గులు వడేవు నీవు శిరసు వంచి
అగ్గమై శ్రీవేంకటేశ ఆపె నీవు గూడితివి
నిగ్గుల మాపై మెచ్చులు నీకెంత ప్రియమో
(||pallavi||)
māgela garisiṁcha māḍigi māḍigi ninnu
jogado mī saridalu sūsede sālunu
(||||)
yiṁdarilona ābĕ yeduvalĕtti yāḍam̐gā
aṁdugu lom̐gevu nīvaṁtulonane
gŏṁdine nīvābĕ maram̐gum̐na jesina panulu
yĕṁdugu nĕkkanivim̐ka nĕnnĕnni galavo
(||||)
kānimāḍam̐lāḍi yābĕ kannula jaṁkiṁcham̐gānu
monāna nunnāḍavidĕ munivalĕne
ye nĕbamuna nābĕgichchina māḍabaṭlu
anugŏni sĕpparānivavi yĕḍuvaṁṭivo
(||||)
kaggi kām̐giḍilo nābĕ kāṁtalam̐ dalabiṁcham̐gā
siggulu vaḍevu nīvu śhirasu vaṁchi
aggamai śhrīveṁkaḍeśha ābĕ nīvu gūḍidivi
niggula mābai mĕchchulu nīgĕṁta priyamo