మాకేల దాఁచేవే మగువ నీ మోహము
(॥పల్లవి॥)
మాకేల దాఁచేవే మగువ నీ మోహము
ఆకడ నీమాటలకు నే మడ్డమాడేమా
(॥వకే॥)
నిండినచెమటనీరు నీచెక్కుల నుండఁ గ
యెండనేలే నీమోవి యెదురెదుర
రెండురెంటా వేయనేలే రీతులైన నీ చన్నులు
వుండనుండఁ గానవచ్చె నువిద నీసుద్దులు
(॥వకే॥)
యెక్కువనీమేనికాఁ క యెండలుగాయఁ గాను
ముక్కులై పులకలేల మోసులోత్తీనే
చిక్కనినెరిఁ గురుల చీఁ కటేల చల్లేవే
తెక్కులనే తేటపడె తేజుపునీగుణము
(॥వకే॥)
భారపునిట్టూర్పుగాలి పచ్చిదేర విసరఁ గా
గారవానఁ గోవిలలు గళము చేరె
కోరి శ్రీవేంకటపతిఁ గూడితివిగాఁ బోలు
ఆరితేరె నీగుట్టు అంతయు మాయెదుట
(||pallavi||)
māgela dām̐seve maguva nī mohamu
āgaḍa nīmāḍalagu ne maḍḍamāḍemā
(||vage||)
niṁḍinasĕmaḍanīru nīsĕkkula nuṁḍam̐ ga
yĕṁḍanele nīmovi yĕdurĕdura
rĕṁḍurĕṁṭā veyanele rīdulaina nī sannulu
vuṁḍanuṁḍam̐ gānavachchĕ nuvida nīsuddulu
(||vage||)
yĕkkuvanīmenigām̐ ka yĕṁḍalugāyam̐ gānu
mukkulai pulagalela mosulottīne
sikkaninĕrim̐ gurula sīm̐ kaḍela salleve
tĕkkulane teḍabaḍĕ tejubunīguṇamu
(||vage||)
bhārabuniṭṭūrbugāli pachchidera visaram̐ gā
gāravānam̐ govilalu gaḽamu serĕ
kori śhrīveṁkaḍabadim̐ gūḍidivigām̐ bolu
āriderĕ nīguṭṭu aṁtayu māyĕduḍa