Maagela amtesi needo maarumalaya

మాకేల అంతేసి నీతో మారుమలయ
Language

(॥పల్లవి॥)
మాకేల అంతేసి నీతో మారుమలయ
యీ కడివారితో యీడు కెనసేవుగాక

(॥మాకే॥)
పంతగతైనా నీతోఁ బలుమారు జగడించ
వంతుదాననా నీతో వాసులెంచను
యెంతకెంత యేమయ్య నిన్నే మాకుఁ జెనకఁగ
బంతివారితోడట్టు పాలించేవు గాక

(॥మాకే॥)
మెచ్చనివారమా నిన్ను మీఁద మీఁద దప్పు లెంచ
మచ్చరములా నీతో మారుకొనను
కుచ్చిత మెఱుఁగుదునా గొరబు నిన్నేల సేసే
మచ్చికసతులపాడి మన్నించేవుగాక

(॥మాకే॥)
సరివెనఁగేమా నీతో సాములుసేయఁగ నేము
పొరుగుపోరచా నిన్ను బూమెలు సేయ
యిరవై శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
వరుసవారికివలె వలచేవుగాక

(||pallavi||)
māgela aṁtesi nīdo mārumalaya
yī kaḍivārido yīḍu kĕnasevugāga

(||māge||)
paṁtagadainā nīdom̐ balumāru jagaḍiṁcha
vaṁtudānanā nīdo vāsulĕṁchanu
yĕṁtagĕṁta yemayya ninne māgum̐ jĕnagam̐ga
baṁtivāridoḍaṭṭu pāliṁchevu gāga

(||māge||)
mĕchchanivāramā ninnu mīm̐da mīm̐da dappu lĕṁcha
machcharamulā nīdo mārugŏnanu
kuchchida mĕṟum̐gudunā gŏrabu ninnela sese
machchigasadulabāḍi manniṁchevugāga

(||māge||)
sarivĕnam̐gemā nīdo sāmuluseyam̐ga nemu
pŏruguborasā ninnu būmĕlu seya
yiravai śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
varusavārigivalĕ valasevugāga