(॥పల్లవి॥)
మాకేల అంతలేసి మందెమేళాలు
మేకు సేయనీ నీతో నేమెఁలుతైనను
(॥వకే॥)
చెలఁగి నీకు నేను సేవలు సేసేదాన
యెలమి మీఁటు చూపనీ యెవ్వ రైనాను
వలచి నీయంకెకెల్ల వచ్చి యిట్టే వుండేదాన
చలము సాదించనీ యేసతియైనను
(॥వకే॥)
మొదలనే పంతమిచ్చి మొక్కులు మొక్కేదాన
యెదుటను బిగియనీ యెవ్వరైనాను
యిదివో నేనెప్పుడును యిచ్చకమాడేదాన
మదించి తిట్టినీ యేమగువైనను
(॥వకే॥)
సిగ్గుదేరఁ గూడి నీ చేతికి లోనైనదాన
యెగ్గులువట్టినీ మరి యెవ్వరైనాను
అగ్గమై శ్రీవేంకటేశ అలనై వుండేదాన
వొగ్గి వురమెక్కనీ యేవువిదైనను
(||pallavi||)
māgela aṁtalesi maṁdĕmeḽālu
megu seyanī nīdo nemĕm̐ludainanu
(||vage||)
sĕlam̐gi nīgu nenu sevalu sesedāna
yĕlami mīm̐ṭu sūbanī yĕvva rainānu
valasi nīyaṁkĕgĕlla vachchi yiṭṭe vuṁḍedāna
salamu sādiṁchanī yesadiyainanu
(||vage||)
mŏdalane paṁtamichchi mŏkkulu mŏkkedāna
yĕduḍanu bigiyanī yĕvvarainānu
yidivo nenĕppuḍunu yichchagamāḍedāna
madiṁchi tiṭṭinī yemaguvainanu
(||vage||)
sigguderam̐ gūḍi nī sedigi lonainadāna
yĕgguluvaṭṭinī mari yĕvvarainānu
aggamai śhrīveṁkaḍeśha alanai vuṁḍedāna
vŏggi vuramĕkkanī yevuvidainanu