Maadonela beeraalu maabu daamkaa nerabevu

మాతోనేల బీరాలు మాపు దాఁకా నెరపేవు
Language

(॥పల్లవి॥)
మాతోనేల బీరాలు మాపు దాఁకా నెరపేవు
ఆ తరుణి పిలిచితే నౌఁగాదనఁగలవా

(॥మాతో॥)
రంతులెంత సేసినాను రాజసము చూపినాను
చెంతల నింతికి నీవు చేతికిలోనే
పంతము లెన్నాడినాను పైపై నెంతపెనఁగినా
మంతనానఁ జెలితోను మారుకొనఁగలవా

(॥మాతో॥)
దీకొనెంత తిట్టినాను దిమ్మరివై వొరసినా
చేకొన్నసతికి నీవు చేతికిలోనే
బూక లెంత సేసినాను బుద్దులెన్ని నేరిచినా
మేకొన్న యీవనితను మితిమీరఁగలవా

(॥మాతో॥)
కోరి యెంత జంకించినా గుబ్బలెంత పిసికినా
చేరికూడినకాంతకు చేతికిలోనే
యీరీతి శ్రీవేంకటేశ యింకా నెట్లుండినా
సారెకు నీలేమతోడ సరిదూఁగఁగలవా

(||pallavi||)
mādonela bīrālu mābu dām̐kā nĕrabevu
ā taruṇi piliside naum̐gādanam̐galavā

(||mādo||)
raṁtulĕṁta sesinānu rājasamu sūbinānu
sĕṁtala niṁtigi nīvu sedigilone
paṁtamu lĕnnāḍinānu paibai nĕṁtabĕnam̐ginā
maṁtanānam̐ jĕlidonu mārugŏnam̐galavā

(||mādo||)
dīgŏnĕṁta tiṭṭinānu dimmarivai vŏrasinā
segŏnnasadigi nīvu sedigilone
būga lĕṁta sesinānu buddulĕnni nerisinā
megŏnna yīvanidanu midimīram̐galavā

(||mādo||)
kori yĕṁta jaṁkiṁchinā gubbalĕṁta pisiginā
serigūḍinagāṁtagu sedigilone
yīrīdi śhrīveṁkaḍeśha yiṁkā nĕṭluṁḍinā
sārĕgu nīlemadoḍa saridūm̐gam̐galavā