మాతోనే యాడఁగరాదా మాటలేమి గలిగినా
(॥పల్లవి॥)
మాతోనే యాడఁగరాదా మాటలేమి గలిగినా
యేతులు నెమ్మెలు సారె నిఁక నేఁటికి
(॥మాతో॥)
పంతము నీ కీడేరె భ్రమసితి నిన్నుఁ జూచి
మంతన మాపెతో నింకా మరి యేఁటికి
చెంత నీ చేఇ మీఁదాయ చేయెత్తి నీకు మొక్కితి
ఇంతకంటె నవ్వు నేఁ డింకా నేఁటికి
(॥మాతో॥)
కోరినట్టె ఆయ నీకు కొలువుదాన నేనైతి
యీరీతి నాపెతో సన్న లిఁక నేఁటికి
నేరుపరి వౌదువు నేనింత యెఱఁగనైతి
యేరా ఆపె మోము చూచే విఁక నేఁటికి
(॥మాతో॥)
మెప్పించుకొంటివి నీవు మేలుదాన నైతి నేను
యెప్పటి కెప్పటి యాన లిఁక నేఁటికి
తప్పక శ్రీ వేంకటేశ తగ నన్నుఁ గూడితివి
యిప్పుడే వినయములు ఇఁక నేఁటికి
(||pallavi||)
mādone yāḍam̐garādā māḍalemi galiginā
yedulu nĕmmĕlu sārĕ nim̐ka nem̐ṭigi
(||mādo||)
paṁtamu nī kīḍerĕ bhramasidi ninnum̐ jūsi
maṁtana mābĕdo niṁkā mari yem̐ṭigi
sĕṁta nī sei mīm̐dāya seyĕtti nīgu mŏkkidi
iṁtagaṁṭĕ navvu nem̐ ḍiṁkā nem̐ṭigi
(||mādo||)
korinaṭṭĕ āya nīgu kŏluvudāna nenaidi
yīrīdi nābĕdo sanna lim̐ka nem̐ṭigi
nerubari vauduvu neniṁta yĕṟam̐ganaidi
yerā ābĕ momu sūse vim̐ka nem̐ṭigi
(||mādo||)
mĕppiṁchugŏṁṭivi nīvu meludāna naidi nenu
yĕppaḍi kĕppaḍi yāna lim̐ka nem̐ṭigi
tappaga śhrī veṁkaḍeśha taga nannum̐ gūḍidivi
yippuḍe vinayamulu im̐ka nem̐ṭigi