Maadonaide maaru malasevu

మాతోనైతే మారు మలసేవు
Language

(॥పల్లవి॥)
మాతోనైతే మారు మలసేవు
ఆతలివారినే అనరాదా నీవు

(॥॥)
చిగురుగుత్తిఁ గొని చేత నేను వేసితేను
మొగమేమి చూచేవు మొక్కలానను
జిగి దేరే నీ మేన జీరలు దీసి యెవ్వతో
అగడు సేసినందుకు అనరాదా నీవు

(॥॥)
కదిసి నే నిమ్మపంట గక్కన నిన్ను వేసితే
పెదవినేల తిట్టేవు పెచ్చు రేఁగి
గదుములు గట్టి చనుఁగవల నూఁది యెవ్వతో
అదిమినందుకు యిట్టే అనరాదా నీవు

(॥॥)
యీరీతి శ్రీవేంకటేశ యిట్టే నే నిన్నుఁ గూడితే
సారెనేల పెనఁగేవు సరసానను
వూర సతులెల్ల నిన్ను నొకతొకతే కూడి
ఆరయ నింతేఁచినందుకనరాదా నీవు

(||pallavi||)
mādonaide māru malasevu
ādalivārine anarādā nīvu

(||||)
siguruguttim̐ gŏni seda nenu vesidenu
mŏgamemi sūsevu mŏkkalānanu
jigi dere nī mena jīralu dīsi yĕvvado
agaḍu sesinaṁdugu anarādā nīvu

(||||)
kadisi ne nimmabaṁṭa gakkana ninnu veside
pĕdavinela tiṭṭevu pĕchchu rem̐gi
gadumulu gaṭṭi sanum̐gavala nūm̐di yĕvvado
adiminaṁdugu yiṭṭe anarādā nīvu

(||||)
yīrīdi śhrīveṁkaḍeśha yiṭṭe ne ninnum̐ gūḍide
sārĕnela pĕnam̐gevu sarasānanu
vūra sadulĕlla ninnu nŏgadŏgade kūḍi
āraya niṁtem̐sinaṁduganarādā nīvu