Maadom bamtaadaadevu mari neevu

మాతోఁ బంతాటాడేవు మరి నీవు
Language

(॥పల్లవి॥)
మాతోఁ బంతాటాడేవు మరి నీవు
కాతరాన నాపెకు కడుఁ గిందుపడవా

(॥మాతోఁ॥)
మగువ మోవికి యాకు మడిచి నీవందియ్యఁగా
జిగిఁ గోనగోరు ఆపె చెక్కు దాఁకెను
పగటున నందుకుఁగాఁ బలుమారు దిట్టితేను
మొగము చూచి చేయెత్తి మొక్కవా నీవపుడు

(॥మాతోఁ॥)
చెలియకుఁ బత్తితోడ సేవలెల్లాఁ జేయఁగాను
కొలువులోనాపె కట్టుకంగు జారెను
కులికి యంతలోన కూరిమిఁ గోపగించితే
పెలుచుఁదనాలు మాని ప్రియములు చెప్పవా

(॥మాతోఁ॥)
కాంతను నీవు గూడి కప్పురునోటికీఁగా
వింత పలుసోఁకలువెల్లవిరాయ
పొంతనే శ్రీవేంకటేశ బొమ్మల జంకించితేను
బంతినే కానుకలిచ్చి బంటనయ్యేననవా

(||pallavi||)
mādom̐ baṁtāḍāḍevu mari nīvu
kādarāna nābĕgu kaḍum̐ giṁdubaḍavā

(||mādom̐||)
maguva movigi yāgu maḍisi nīvaṁdiyyam̐gā
jigim̐ gonagoru ābĕ sĕkku dām̐kĕnu
pagaḍuna naṁdugum̐gām̐ balumāru diṭṭidenu
mŏgamu sūsi seyĕtti mŏkkavā nīvabuḍu

(||mādom̐||)
sĕliyagum̐ battidoḍa sevalĕllām̐ jeyam̐gānu
kŏluvulonābĕ kaṭṭugaṁgu jārĕnu
kuligi yaṁtalona kūrimim̐ gobagiṁchide
pĕlusum̐danālu māni priyamulu sĕppavā

(||mādom̐||)
kāṁtanu nīvu gūḍi kappurunoḍigīm̐gā
viṁta palusom̐kaluvĕllavirāya
pŏṁtane śhrīveṁkaḍeśha bŏmmala jaṁkiṁchidenu
baṁtine kānugalichchi baṁṭanayyenanavā