Maadodi navvulu maṟi yaala se

మాతోడి నవ్వులు మఱి యాల చే
Language

(॥పల్లవి॥)
మాతోడి నవ్వులు మఱి యాల చే-
చేత నెదురు చూచీనదె చెలియ

(॥మాతోడి॥)
వలసిన యెడలకు వచ్చేదే మేలు
వలవని జోలికి వాదె మేలు
బలిమి సేయమిఁక పడఁతికడకు మ
మ్మెలమి నంపినా యెట్టైనా మేలు

(॥మాతోడి॥)
మనసు వచ్చితే మాటాడుటే మేలు
ననుచకున్న మోనము మేలు
అనలేము నిన్నునాసపడినచెలిఁ
జెనకక నీవేమి సేసినా మేలు

(॥మాతోడి॥)
పొందే కలిగిన భోగించుటే మేలు
కందిన యెడ నలుకలు మేలు
యిందులో శ్రీ వేంకటేశ కూడితివి
యిందుముఖికి నీకిదియే మేలు

(||pallavi||)
mādoḍi navvulu maṟi yāla se-
seda nĕduru sūsīnadĕ sĕliya

(||mādoḍi||)
valasina yĕḍalagu vachchede melu
valavani joligi vādĕ melu
balimi seyamim̐ka paḍam̐tigaḍagu ma
mmĕlami naṁpinā yĕṭṭainā melu

(||mādoḍi||)
manasu vachchide māḍāḍuḍe melu
nanusagunna monamu melu
analemu ninnunāsabaḍinasĕlim̐
jĕnagaka nīvemi sesinā melu

(||mādoḍi||)
pŏṁde kaligina bhogiṁchuḍe melu
kaṁdina yĕḍa nalugalu melu
yiṁdulo śhrī veṁkaḍeśha kūḍidivi
yiṁdumukhigi nīgidiye melu