మాతోడి గొడవేల మాపు దాఁకాను
(॥పల్లవి॥)
మాతోడి గొడవేల మాపు దాఁకాను
యేతులకు వెంటవచ్చే విది యేమోకాక
(॥మాతో ॥)
సింగారించఁగానే ఆపెచేతికి లోనైతివి
వుంగరపువేలిగోరి కొరవైతివి
కంగినతిట్ల కెల్ల కణఁజమైతివి
పంగెనమానిసి వింక పనికివచ్చేవా
(॥మాతో॥)
కమ్మటి నాపెమోవికిఁ గంచమవైతివి
దొమ్మిచూపులబందెకు దొడ్డివైతివి
పమ్మిననవ్వులకెల్లా పడిగమవైతివి
వుమ్మడివాఁడవు నీకు నున్నదా స్వతంత్రము
(॥మాతో॥)
కలికిరతులకెల్లా గద్దెవు నీవైతివి
వలపులపంటకెల్ల వామివైతివి
బలిమి శ్రీవేంకటేశ పైకొని న న్నేలితివి
వలరాచకయ్యాన నీవంక వేసటున్నదా
(||pallavi||)
mādoḍi gŏḍavela mābu dām̐kānu
yedulagu vĕṁṭavachche vidi yemogāga
(||mādo ||)
siṁgāriṁcham̐gāne ābĕsedigi lonaidivi
vuṁgarabuveligori kŏravaidivi
kaṁginadiṭla kĕlla kaṇam̐jamaidivi
paṁgĕnamānisi viṁka panigivachchevā
(||mādo||)
kammaḍi nābĕmovigim̐ gaṁchamavaidivi
dŏmmisūbulabaṁdĕgu dŏḍḍivaidivi
pamminanavvulagĕllā paḍigamavaidivi
vummaḍivām̐ḍavu nīgu nunnadā svadaṁtramu
(||mādo||)
kaligiradulagĕllā gaddĕvu nīvaidivi
valabulabaṁṭagĕlla vāmivaidivi
balimi śhrīveṁkaḍeśha paigŏni na nnelidivi
valarāsagayyāna nīvaṁka vesaḍunnadā