(॥పల్లవి॥)
మాతోడఁ దనకేల మచ్చరములు
పోతరించి తానేల వుల్లసిలీనే
(॥మాతో॥)
మలసి మమ్మేల దూరీ మగఁడైనవానిఁ దానే
వలపించవలదా వనితైతేను
వెలయ నాతఁడు నావెంటవెంటఁ దిరిగితే
కలికి తానేల యింత కాఁకరేఁగీనే
(॥మాతో॥)
సవతులఁ దానేల సాదించీ నాతనినే
యేవలఁ బోకుండా భ్రమయింపించరాదా
రవళి నాచెప్పినట్లు రమణుఁడు సేసితేను
చివుకునఁ దానేల చిమ్మిరేఁగినే
(॥మాతో॥)
అండనున్నవారినేల అద్దలించీ నాయకుని
బండు బండు సేసి యట్టె పట్టుకోరాదా
దండి శ్రీ వేంకటేశుఁడు తానే నన్నిటు గూడె
బెండుపడి తానేల పెచ్చురేఁగీనే
(||pallavi||)
mādoḍam̐ danagela machcharamulu
podariṁchi tānela vullasilīne
(||mādo||)
malasi mammela dūrī magam̐ḍainavānim̐ dāne
valabiṁchavaladā vanidaidenu
vĕlaya nādam̐ḍu nāvĕṁṭavĕṁṭam̐ dirigide
kaligi tānela yiṁta kām̐karem̐gīne
(||mādo||)
savadulam̐ dānela sādiṁchī nādanine
yevalam̐ boguṁḍā bhramayiṁpiṁcharādā
ravaḽi nāsĕppinaṭlu ramaṇum̐ḍu sesidenu
sivugunam̐ dānela simmirem̐gine
(||mādo||)
aṁḍanunnavārinela addaliṁchī nāyaguni
baṁḍu baṁḍu sesi yaṭṭĕ paṭṭugorādā
daṁḍi śhrī veṁkaḍeśhum̐ḍu tāne nanniḍu gūḍĕ
bĕṁḍubaḍi tānela pĕchchurem̐gīne