Maado nimteshaala mamdemelamu

మాతో నింతేశాల మందెమేళము
Language

(॥పల్లవి॥)
మాతో నింతేశాల మందెమేళము
కాతరానఁ దిట్టవయ్యా గయ్యాళుల నీవు

(॥మాతో॥)
చలివాసి నీతోను సరసములాడేమా
మలసేమా మానాపతిమగువలము
కెలసి కెలసి నీవే కేరికేరి నవ్వవయ్యా
పిలిచేనీరట్టడిప్రియురాండ్లలోను

(॥మాతో॥)
పచ్చిసేసి నీపైని పంతములు నెరపేమా
యిచ్చకములాడేయట్టియంతులము
కుచ్చికుచ్చి నీకునీవేకొంగువట్టి తియ్యవయ్య
మచ్చరించేనీ కాఁగిటిమంకుగొల్లెతలమా

(॥మాతో॥)
బాసలిమ్మంటా నిన్ను బలుములు సేసేమా
సేసవెట్టి పెండ్లాడినచెలులము
అసల శ్రీవేంకటేశ అంకెలఁ జెనకవయ్యా
రాసి నీతోఁ బెనఁగేటిరాఁగవనితలను

(||pallavi||)
mādo niṁteśhāla maṁdĕmeḽamu
kādarānam̐ diṭṭavayyā gayyāḽula nīvu

(||mādo||)
salivāsi nīdonu sarasamulāḍemā
malasemā mānābadimaguvalamu
kĕlasi kĕlasi nīve kerigeri navvavayyā
pilisenīraṭṭaḍipriyurāṁḍlalonu

(||mādo||)
pachchisesi nībaini paṁtamulu nĕrabemā
yichchagamulāḍeyaṭṭiyaṁtulamu
kuchchiguchchi nīgunīvegŏṁguvaṭṭi tiyyavayya
machchariṁchenī kām̐giḍimaṁkugŏllĕdalamā

(||mādo||)
bāsalimmaṁṭā ninnu balumulu sesemā
sesavĕṭṭi pĕṁḍlāḍinasĕlulamu
asala śhrīveṁkaḍeśha aṁkĕlam̐ jĕnagavayyā
rāsi nīdom̐ bĕnam̐geḍirām̐gavanidalanu