మాతో నేమిచెప్పేవే మాపు దాఁకాను
(॥పల్లవి॥)
మాతో నేమిచెప్పేవే మాపు దాఁకాను
ఆతనిని చిలుకచే నాడించవలదా
(॥మాతో ॥)
చేరి నవ్వవచ్చుఁగాక చేయిసోఁకఁ జెనకితే
వోరుచు కెవ్వరికైనా నుండవచ్చునా
ధీరత ఇంతలేకుండితే నప్పుడే యతనిపై
కోరి వేరొకటివెట్టి దూరుసేయవలదా
(॥మాతో ॥)
జూదమాడవచ్చుఁగాక సులభాన గెలిచితే
వాదులేక యీను విడువఁగవచ్చునా
పాదుకొని నీవింత పంతమాడేదానవు
మోదపు నీచెలులచే మోసపుచ్చవలదా
(॥మాతో॥)
తమి రెఁచవచ్చుఁగాక తగురతిఁ గినిసితే
తెమల కందుకు సమ్మతించవచ్చునా
అమర శ్రీవేంకటేశు నటు గూడినదానవు
మముబోంట్లచే మారుమలయించవలదా
(||pallavi||)
mādo nemisĕppeve mābu dām̐kānu
ādanini silugase nāḍiṁchavaladā
(||mādo ||)
seri navvavachchum̐gāga seyisom̐kam̐ jĕnagide
vorusu kĕvvarigainā nuṁḍavachchunā
dhīrada iṁtaleguṁḍide nappuḍe yadanibai
kori verŏgaḍivĕṭṭi dūruseyavaladā
(||mādo ||)
jūdamāḍavachchum̐gāga sulabhāna gĕliside
vādulega yīnu viḍuvam̐gavachchunā
pādugŏni nīviṁta paṁtamāḍedānavu
modabu nīsĕlulase mosabuchchavaladā
(||mādo||)
tami rĕm̐savachchum̐gāga taguradim̐ giniside
tĕmala kaṁdugu sammadiṁchavachchunā
amara śhrīveṁkaḍeśhu naḍu gūḍinadānavu
mamuboṁṭlase mārumalayiṁchavaladā