Maado nemi seppevu maabu daamkaa suddulu

మాతో నేమి చెప్పేవు మాపు దాఁకా సుద్దులు
Language

(॥పల్లవి॥)
మాతో నేమి చెప్పేవు మాపు దాఁకా సుద్దులు
నీతి విచారించుకొంటే నీవెఱఁగవా

(॥॥)
నమ్మిక గావలెనని నవ్వు దెచ్చుకొనెఁగాక
కొమ్మమనసులోపలికోప మారెనా
సమ్మతించవచ్చునా చల్లజంపు లివిగాక
నెమ్మి నీచేసినచేఁత నీ వెఱఁగవా

(॥॥)
మచ్చిక చూపవలసి మాటలాడె నింతెకాక
కచ్చుపెట్టుకున్నయలుకలు దీరెనా
మెచ్చఁదగునా యివి మిక్కిలి కాఁకలుగాక
నిచ్చలపు నీగుణాలు నీ వెఱఁగవా

(॥॥)
వలపు రేఁచేనని వంకచూచె నింతెకాక
తలపులో నెంజరి వింతటఁ బాసెనా
యెలమి శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి
నెలకొన్న నీమహిమ నీవెఱగవా

(||pallavi||)
mādo nemi sĕppevu mābu dām̐kā suddulu
nīdi visāriṁchugŏṁṭe nīvĕṟam̐gavā

(||||)
nammiga gāvalĕnani navvu dĕchchugŏnĕm̐gāga
kŏmmamanasulobaligoba mārĕnā
sammadiṁchavachchunā sallajaṁpu livigāga
nĕmmi nīsesinasem̐ta nī vĕṟam̐gavā

(||||)
machchiga sūbavalasi māḍalāḍĕ niṁtĕgāga
kachchubĕṭṭugunnayalugalu dīrĕnā
mĕchcham̐dagunā yivi mikkili kām̐kalugāga
nichchalabu nīguṇālu nī vĕṟam̐gavā

(||||)
valabu rem̐senani vaṁkasūsĕ niṁtĕgāga
talabulo nĕṁjari viṁtaḍam̐ bāsĕnā
yĕlami śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
nĕlagŏnna nīmahima nīvĕṟagavā