Maado nela tana kimta machcharaalu neeve

మాతో నేల తన కింత మచ్చరాలు నీవె
Language

(॥పల్లవి॥)
మాతో నేల తన కింత మచ్చరాలు నీవె
పోతరించిన యాపెకు బుద్ది చెప్పరాదా

(॥మాతో॥)
పక్కన నీతో నేను పదరి నవ్వితి నంటా
అక్కడనుండె సణఁగు లాపె ఆడీని
తక్కి చలిమి బలిమి తన కింత గలితేను
చిక్కించుక నిన్నేమైనాఁ జేయఁగ వలెఁబో

(॥మాతో॥)
మంచముపై నీవు నేను మరిగి వున్నారమని
యించుకంత చూడ నోప కీసడించీని
నించి తన కంతేసి నేరుపే కలిగితేను
అంచల నిన్ను రప్పించి అదలింవలెఁ బో

(॥మాతో॥)
కందువ నీవు నన్నుఁ గాఁగిట గూడితి వంటా
చెంది లోలోనే తాను చిన్నఁ బోయ్యిని
యిందుకు శ్రీవెంకటేశ యిన్నిటా తా జా ణైతేఁ
బొంది యిచ్చకము నేసి పొదుగఁగ వలెఁబో

(||pallavi||)
mādo nela tana kiṁta machcharālu nīvĕ
podariṁchina yābĕgu buddi sĕpparādā

(||mādo||)
pakkana nīdo nenu padari navvidi naṁṭā
akkaḍanuṁḍĕ saṇam̐gu lābĕ āḍīni
takki salimi balimi tana kiṁta galidenu
sikkiṁchuga ninnemainām̐ jeyam̐ga valĕm̐bo

(||mādo||)
maṁchamubai nīvu nenu marigi vunnāramani
yiṁchugaṁta sūḍa noba kīsaḍiṁchīni
niṁchi tana kaṁtesi nerube kaligidenu
aṁchala ninnu rappiṁchi adaliṁvalĕm̐ bo

(||mādo||)
kaṁduva nīvu nannum̐ gām̐giḍa gūḍidi vaṁṭā
sĕṁdi lolone tānu sinnam̐ boyyini
yiṁdugu śhrīvĕṁkaḍeśha yinniḍā tā jā ṇaidem̐
bŏṁdi yichchagamu nesi pŏdugam̐ga valĕm̐bo