Maado nela seppevu maadi maadigi

మాతో నేల చెప్పేవు మాటి మాటికి
Language

(॥పల్లవి॥)
మాతో నేల చెప్పేవు మాటి మాటికి
నీతో నవుఁగాదన నేరము నేమెన్నఁడు

(॥వతో॥)
తప్పని బొంకని నీ తగవులేల చెప్పేవు
తప్పు నీయందేమి గల్లాఁ దడవేరా
చెప్పేరు గొల్లెతలే చేరి యడుగుకోవయ్య
నెప్పున నిన్నుఁ గాదన నేరము నేమెన్నఁడు

(॥వతో॥)
నగుచు నీ వోరుపులు నాతోనేమి చెప్పేవు
జగడించినా నిన్ను సాదించేరా
పగటు నీ దయలు చుప్పనాతికిఁ జెప్పవయ్య
నిగిడి నిష్టూరమాడనేరము నేమెన్నఁడు

(॥వతో॥)
సారెకు శ్రీ వేంకటేశ సత్యాలేల చెప్పేవు
కారులాడినా నిన్నుఁ గాదనేరా
పోర కలమేల్మంగను బొంకు దైత్యాంగనలతో
నీరతిఁ గూడనే కాని నేరము నే మెన్నఁడూ

(||pallavi||)
mādo nela sĕppevu māḍi māḍigi
nīdo navum̐gādana neramu nemĕnnam̐ḍu

(||vado||)
tappani bŏṁkani nī tagavulela sĕppevu
tappu nīyaṁdemi gallām̐ daḍaverā
sĕpperu gŏllĕdale seri yaḍugugovayya
nĕppuna ninnum̐ gādana neramu nemĕnnam̐ḍu

(||vado||)
nagusu nī vorubulu nādonemi sĕppevu
jagaḍiṁchinā ninnu sādiṁcherā
pagaḍu nī dayalu suppanādigim̐ jĕppavayya
nigiḍi niṣhṭūramāḍaneramu nemĕnnam̐ḍu

(||vado||)
sārĕgu śhrī veṁkaḍeśha satyālela sĕppevu
kārulāḍinā ninnum̐ gādanerā
pora kalamelmaṁganu bŏṁku daityāṁganalado
nīradim̐ gūḍane kāni neramu ne mĕnnam̐ḍū