Maado nela pamtabumaada laadevu

మాతో నేల పంతపుమాట లాడేవు
Language

(॥పల్లవి॥)
మాతో నేల పంతపుమాట లాడేవు
యేతు లెల్లాఁ జూపఁగా యేలనేమా నేము

(॥మాతో॥)
దాయక పాయక పొందు తనకు నీకుఁ గద్దని
నీయెదుట నాపె యాడె నీవు వింటివి
యేయెడా మీచుట్టరికా లెఱుఁగుదుమా తొల్లి
వో యయ్య తెలుపుకోఁగా వొద్దనేమా నేము

(॥మాతో॥)
రావుగాఁగా ముద్దుటుంగరము తనవేలను
చూపి నా గురుతుగాఁ జూచుకొంటివి
మాపుదాఁకా మీకతలు మాచేత నున్నవా
వోపి బాసచేసుకోఁగా వొద్దనేమా నేము

(॥మాతో॥)
అట్టే యాపె నీకు నాల నైతి నంటా నీకొంగు
పట్టి తీసితే సిగ్గు వడితివి
మెట్టి పిండిసేసేమా మిమ్ము శ్రీవేంకటేశుఁడ
వొట్టుక మమ్మేలితివి వొద్దనేమా నేము

(||pallavi||)
mādo nela paṁtabumāḍa lāḍevu
yedu lĕllām̐ jūbam̐gā yelanemā nemu

(||mādo||)
dāyaga pāyaga pŏṁdu tanagu nīgum̐ gaddani
nīyĕduḍa nābĕ yāḍĕ nīvu viṁṭivi
yeyĕḍā mīsuṭṭarigā lĕṟum̐gudumā tŏlli
vo yayya tĕlubugom̐gā vŏddanemā nemu

(||mādo||)
rāvugām̐gā mudduḍuṁgaramu tanavelanu
sūbi nā gurudugām̐ jūsugŏṁṭivi
mābudām̐kā mīgadalu māseda nunnavā
vobi bāsasesugom̐gā vŏddanemā nemu

(||mādo||)
aṭṭe yābĕ nīgu nāla naidi naṁṭā nīgŏṁgu
paṭṭi tīside siggu vaḍidivi
mĕṭṭi piṁḍisesemā mimmu śhrīveṁkaḍeśhum̐ḍa
vŏṭṭuga mammelidivi vŏddanemā nemu