మాతో నీవు యేమనినా మాటలాడే మింతేకాక
(॥పల్లవి॥)
మాతో నీవు యేమనినా మాటలాడే మింతేకాక
యేతుల నెవ్వరిగొడ వేఁటికి మాకు
(॥మాతో॥)
రవ్వ నాపె నిన్నేమన్నా రచ్చ నీ వాపె నేమన్నా
యెవ్వరి నౌఁగాదననేల మాకు
అవ్వలఁ దొండకు వెలుఁగు సాకి రింతేకాక
యెవ్వ రెఱుఁగుదురు మీయిద్దరిలో పనులు
(॥మాతో॥)
గోర నాపె నిన్నొ త్తనీ కొమ్మను నీవైన నొత్తు
యీరసాన వహించుకోనేల మాకు
చేరువనూతికొలఁది చేఁతాడే యెరుఁగుఁగాక
సారె మిమ్ము నంత మాకు సాదించనేఁటికి
(॥మాతో॥)
చెలి సన్నలు సేయనీ చేరి నీవు సన్నసేయు
కలసితి విదె శ్రీవేంకటేశ నన్ను
యెలమి నీరుకొలఁది యెప్పుడు తామెర కాక
వెలుపటి మీసుద్దులు వివరించనోపము
(||pallavi||)
mādo nīvu yemaninā māḍalāḍe miṁtegāga
yedula nĕvvarigŏḍa vem̐ṭigi māgu
(||mādo||)
ravva nābĕ ninnemannā rachcha nī vābĕ nemannā
yĕvvari naum̐gādananela māgu
avvalam̐ dŏṁḍagu vĕlum̐gu sāgi riṁtegāga
yĕvva rĕṟum̐guduru mīyiddarilo panulu
(||mādo||)
gora nābĕ ninnŏ ttanī kŏmmanu nīvaina nŏttu
yīrasāna vahiṁchugonela māgu
seruvanūdigŏlam̐di sem̐tāḍe yĕrum̐gum̐gāga
sārĕ mimmu naṁta māgu sādiṁchanem̐ṭigi
(||mādo||)
sĕli sannalu seyanī seri nīvu sannaseyu
kalasidi vidĕ śhrīveṁkaḍeśha nannu
yĕlami nīrugŏlam̐di yĕppuḍu tāmĕra kāga
vĕlubaḍi mīsuddulu vivariṁchanobamu