Maado maamtalu mari yelaadevu

మాతో మాఁటలు మరి యేలాడేవు
Language

(॥పల్లవి॥)
మాతో మాఁటలు మరి యేలాడేవు
తోతో నీకింక దొరకెఁగా నేఁడు

(॥వతో॥)
నిండునిదానము నెలతఁజఘన మిది
కొండలు కోట్లు గురుకుచంబు లివె
పండినపంటలు పలుకుటధర మిది
అండనె రమణుడ అబ్బెఁగా నీకు

(॥వతో॥)
తమ్మివనంబులు తరుణిపాదములు
కమ్మినకరములు కల్పకశాఖలు
వుమ్మిడి వయ సిది వూరెడియమృతము
కమ్మర నీ కిదె కలిగెఁగా నేండు

(॥వతో॥)
తరుణివదనమఁదపుఁ దోరణములు
కెరలినకాఁగిలి గృహప్రవేశము
యిరవుగ శ్రీవేంకటేశ నీకు రతి
సిరుల నీకెతోఁ జెల్లెఁగా నీకు

(||pallavi||)
mādo mām̐ṭalu mari yelāḍevu
todo nīgiṁka dŏragĕm̐gā nem̐ḍu

(||vado||)
niṁḍunidānamu nĕladam̐jaghana midi
kŏṁḍalu koṭlu gurugusaṁbu livĕ
paṁḍinabaṁṭalu paluguḍadhara midi
aṁḍanĕ ramaṇuḍa abbĕm̐gā nīgu

(||vado||)
tammivanaṁbulu taruṇibādamulu
kamminagaramulu kalbagaśhākhalu
vummiḍi vaya sidi vūrĕḍiyamṛtamu
kammara nī kidĕ kaligĕm̐gā neṁḍu

(||vado||)
taruṇivadanamam̐dabum̐ doraṇamulu
kĕralinagām̐gili gṛhapraveśhamu
yiravuga śhrīveṁkaḍeśha nīgu radi
sirula nīgĕdom̐ jĕllĕm̐gā nīgu