Maado daamse vimkaa maguvaro yimka nele

మాతో దాఁచే వింకా మగువరో యిఁక నేలే
Language

(॥పల్లవి॥)
మాతో దాఁచే వింకా మగువరో యిఁక నేలే
యీతలి ఆతలి ముచ్చట యిరవులు దెలిపెడిని

(॥మాతో॥)
చెక్కునఁ బెట్టినచేయిని చెలిపై నొరగిన మేనుగు
ముక్కునఁ బెట్టిన వేలును మోహము దెలిపెడిని
తొక్కెడిపాదపు వ్రాఁతల తొడిఁబడ జారిన తురుమును
వెక్కసమగు నిట్టూర్పులు విరహము దెలిపెడిని

(॥మాతో॥)
రెప్పలు వేయనిచూపులు రేసుల వాడిన మోవియు
అప్పసమగు పెంజెమటలు ఆసలు దెలిపెడిని
యెప్పుడు నేకాంతంబులు యెక్కువలగు పరవశములు
తిప్పఁగరాని పరాకులు తెగువలు దెలిపెడిని

(॥మాతో॥)
మోమున నిండిన కళలును మోనపు సెలవుల నవ్వులు
కామించిన సంభోగపు కత లివె తెలిపెడిని
దోమటి దొడికెటిసిగ్గులు తోరవు సంతోషంబులు
కోమలి శ్రీవేంకటపతి కూటమి దెలిపెడిని

(||pallavi||)
mādo dām̐se viṁkā maguvaro yim̐ka nele
yīdali ādali muchchaḍa yiravulu dĕlibĕḍini

(||mādo||)
sĕkkunam̐ bĕṭṭinaseyini sĕlibai nŏragina menugu
mukkunam̐ bĕṭṭina velunu mohamu dĕlibĕḍini
tŏkkĕḍibādabu vrām̐tala tŏḍim̐baḍa jārina turumunu
vĕkkasamagu niṭṭūrbulu virahamu dĕlibĕḍini

(||mādo||)
rĕppalu veyanisūbulu resula vāḍina moviyu
appasamagu pĕṁjĕmaḍalu āsalu dĕlibĕḍini
yĕppuḍu negāṁtaṁbulu yĕkkuvalagu paravaśhamulu
tippam̐garāni parāgulu tĕguvalu dĕlibĕḍini

(||mādo||)
momuna niṁḍina kaḽalunu monabu sĕlavula navvulu
kāmiṁchina saṁbhogabu kada livĕ tĕlibĕḍini
domaḍi dŏḍigĕḍisiggulu toravu saṁtoṣhaṁbulu
komali śhrīveṁkaḍabadi kūḍami dĕlibĕḍini