మాటి మాటికి నానలు మరేలయ్యా
(॥పల్లవి॥)
మాటి మాటికి నానలు మరేలయ్యా
నీటుతోడి కళలెల్లా నీ మేననే వున్నవి
(॥వటి॥)
కాంతమేనఁ బూసినట్టి గందపుఁ బూఁతలచొప్పు
యింతలోనే మేన నిండి యిట్టెవున్నవి
చెంతలనాపె చెలఁగి సేసేవిడేలెల్లా
పొంతల నేఁడిప్పుడు నీపుక్కిటనే వున్నవి
(॥మాటి॥)
పొలఁతి ముడిచినట్టి పూవులవాసన చొప్పు
మొలచినట్టు నీతురుమున నున్నవి
మలసి యాపె వెట్టిన మంచి మంచి సొమ్ములెల్లా
నెలకొని యిప్పుడు నీనిలువున నున్నవి
(॥మాటి॥)
పడఁతి మైఁ జల్లుకొన్న పన్నీటి చొప్పులెల్ల
తడిసి నీపచ్చడానఁ దతిఁ గొన్నవి
అడరి శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
కడఁగి నిన్నుఁ గూడితి కలలెల్లా నున్నవి
(||pallavi||)
māḍi māḍigi nānalu marelayyā
nīḍudoḍi kaḽalĕllā nī menane vunnavi
(||vaḍi||)
kāṁtamenam̐ būsinaṭṭi gaṁdabum̐ būm̐talasŏppu
yiṁtalone mena niṁḍi yiṭṭĕvunnavi
sĕṁtalanābĕ sĕlam̐gi seseviḍelĕllā
pŏṁtala nem̐ḍippuḍu nībukkiḍane vunnavi
(||māḍi||)
pŏlam̐ti muḍisinaṭṭi pūvulavāsana sŏppu
mŏlasinaṭṭu nīdurumuna nunnavi
malasi yābĕ vĕṭṭina maṁchi maṁchi sŏmmulĕllā
nĕlagŏni yippuḍu nīniluvuna nunnavi
(||māḍi||)
paḍam̐ti maim̐ jallugŏnna pannīḍi sŏppulĕlla
taḍisi nībachchaḍānam̐ dadim̐ gŏnnavi
aḍari śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
kaḍam̐gi ninnum̐ gūḍidi kalalĕllā nunnavi