(॥పల్లవి॥)
మాధవునకు మంగళము
సాధుప్రియునకు జయమంగళమూ
(॥మాధవు॥)
మదనగురునకును మంగళమూ, మా
మదిలో హరికిని మంగళము
మదరిపుహరునకు మంగళము
చదువులమూర్తికి జయమంగళమూ
(॥మాధవు॥)
మహిమాధికునకు మంగళమూ
మహమహునకు మంగళమూ
మహీధవునకు మంగళము
సహజతేజునకు జయమంగళమూ
(॥మాధవు॥)
మాయరహితునికి మంగళము
మా యింటిపతికిని మంగళము
యీయెడ శ్రీవేంకటేశ్వరుఁ డీతని
చాయ శ్రీపతికి జయమంగళమూ
(||pallavi||)
mādhavunagu maṁgaḽamu
sādhupriyunagu jayamaṁgaḽamū
(||mādhavu||)
madanagurunagunu maṁgaḽamū, mā
madilo harigini maṁgaḽamu
madaribuharunagu maṁgaḽamu
saduvulamūrdigi jayamaṁgaḽamū
(||mādhavu||)
mahimādhigunagu maṁgaḽamū
mahamahunagu maṁgaḽamū
mahīdhavunagu maṁgaḽamu
sahajadejunagu jayamaṁgaḽamū
(||mādhavu||)
māyarahidunigi maṁgaḽamu
mā yiṁṭibadigini maṁgaḽamu
yīyĕḍa śhrīveṁkaḍeśhvarum̐ ḍīdani
sāya śhrībadigi jayamaṁgaḽamū