Maadalenni yaadeve maabu daamkaanu

మాటలెన్ని యాడేవే మాపు దాఁకాను
Language

(॥పల్లవి॥)
మాటలెన్ని యాడేవే మాపు దాఁకాను
చాటువగా రమణుఁడు చనవిచ్చె నాకును

(॥మాట॥)
సలిగెగలదానికి సరసములాడఁజెల్లు
తెలిమికత్తెకు నేమిసేసినాఁజెల్లు
కలిమిగలదానికి గర్వించియుండఁజెల్లు
పిలుపుగలదానికి బీరములు చెల్లునే

(॥మాట॥)
వొడఁబాటుగలదాని కొరసి పెనఁగఁజెల్లు
బడివాయనిదానికి పంతము చెల్లు
కడుఁజుట్టమైనదానిఘనతలెల్లాఁ జెల్లు
వొడికముగలదాని వొప్పిదము చెల్లునే

(॥మాట॥)
బత్తిగలిగినదానిపగటులెల్లాఁ జెల్లు
హత్తికొలిచినదానియందము చెల్లు
కొత్తగా నలమేల్ మంగకుఁ బతి శ్రీవేంకటేశుఁ
డిత్తల నన్ను నేలె నింపు నాకే చెల్లునే

(||pallavi||)
māḍalĕnni yāḍeve mābu dām̐kānu
sāḍuvagā ramaṇum̐ḍu sanavichchĕ nāgunu

(||māḍa||)
saligĕgaladānigi sarasamulāḍam̐jĕllu
tĕlimigattĕgu nemisesinām̐jĕllu
kalimigaladānigi garviṁchiyuṁḍam̐jĕllu
pilubugaladānigi bīramulu sĕllune

(||māḍa||)
vŏḍam̐bāḍugaladāni kŏrasi pĕnam̐gam̐jĕllu
baḍivāyanidānigi paṁtamu sĕllu
kaḍum̐juṭṭamainadānighanadalĕllām̐ jĕllu
vŏḍigamugaladāni vŏppidamu sĕllune

(||māḍa||)
battigaliginadānibagaḍulĕllām̐ jĕllu
hattigŏlisinadāniyaṁdamu sĕllu
kŏttagā nalamel maṁgagum̐ badi śhrīveṁkaḍeśhum̐
ḍittala nannu nelĕ niṁpu nāge sĕllune