మాటలేమి గలిగినా మరి విన్నవించేను
(॥పల్లవి॥)
మాటలేమి గలిగినా మరి విన్నవించేను
నీటుతోడి నిన్నుఁ జూచి నేనేమనేను
(॥మాట॥)
చేయిమీఁదఁజేయివేసి సిగ్గుదేర మాటలాడి
చాలయు సన్నలుసేసి చలివాపేవు
మాయలెల్లా నేరుతువు మర్మము లెరుఁగుదువు
నీయెడ కియ్యకొనక నే నేమనేను
(॥మాట॥)
వొడివట్టి కాలుదొక్కి వొడఁబరచుకొంటాను
మడుపునవ్వులు నవ్వి మట్టుపెట్టేవు
కడువేగిరకాఁడవు గర్వమెల్లానీసొమ్ము
నిడివిగా మన్నించఁగ నేనేమనేను
(॥మాట॥)
చెలఁగి కాఁగిలించుక చెక్కులు గోరనొక్కి
సొలచి రతులనెల్ల జొక్కించేవు
యెలమిశ్రీవేంకటేశ యిన్నిటా జాణఁడవు
నెలకొని పెండ్లాడఁగ నే నేమనేను
(||pallavi||)
māḍalemi galiginā mari vinnaviṁchenu
nīḍudoḍi ninnum̐ jūsi nenemanenu
(||māḍa||)
seyimīm̐dam̐jeyivesi siggudera māḍalāḍi
sālayu sannalusesi salivābevu
māyalĕllā neruduvu marmamu lĕrum̐guduvu
nīyĕḍa kiyyagŏnaga ne nemanenu
(||māḍa||)
vŏḍivaṭṭi kāludŏkki vŏḍam̐barasugŏṁṭānu
maḍubunavvulu navvi maṭṭubĕṭṭevu
kaḍuvegiragām̐ḍavu garvamĕllānīsŏmmu
niḍivigā manniṁcham̐ga nenemanenu
(||māḍa||)
sĕlam̐gi kām̐giliṁchuga sĕkkulu goranŏkki
sŏlasi radulanĕlla jŏkkiṁchevu
yĕlamiśhrīveṁkaḍeśha yinniḍā jāṇam̐ḍavu
nĕlagŏni pĕṁḍlāḍam̐ga ne nemanenu