మాటలేల మూటలేల మాపుదాఁకా జోలియేల
(॥పల్లవి॥)
మాటలేల మూటలేల మాపుదాఁకా జోలియేల
కూటువ చేకత్తి గోరి గురుతుకు రారా
(॥మాట॥)
వోరి నాపలుకుఁ బంత మొక్కటిగాఁ జేయకున్న
పేరుకొని నీవు వొట్టు పెట్టరా నన్ను
యీరసాననేమనిన యీడ నీతో నాకేల
గారవాన మదనునిగరిడికి రారా
(॥మాట॥)
చలము సాదించి నిన్నే సమ్మతించఁ జేయకున్న
నలువురిలో నన్ను నవ్వరా నీవు
పిలిచి నీకు నాకు పెంటపట్టుబీరమేల
కలతము వలపుల కలినికి రారా
(॥మాట॥)
చేరి నిన్నే యెందుకైనఁ జేయి చాఁపించకవుంటే
ఆరసి నన్నే వెంగేలాడరా నీవు
యీరీతి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
చూరలుగా నాచన్నుల సూటికిఁక రారా
(||pallavi||)
māḍalela mūḍalela mābudām̐kā joliyela
kūḍuva segatti gori gurudugu rārā
(||māḍa||)
vori nābalugum̐ baṁta mŏkkaḍigām̐ jeyagunna
perugŏni nīvu vŏṭṭu pĕṭṭarā nannu
yīrasānanemanina yīḍa nīdo nāgela
gāravāna madanunigariḍigi rārā
(||māḍa||)
salamu sādiṁchi ninne sammadiṁcham̐ jeyagunna
naluvurilo nannu navvarā nīvu
pilisi nīgu nāgu pĕṁṭabaṭṭubīramela
kaladamu valabula kalinigi rārā
(||māḍa||)
seri ninne yĕṁdugainam̐ jeyi sām̐piṁchagavuṁṭe
ārasi nanne vĕṁgelāḍarā nīvu
yīrīdi śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
sūralugā nāsannula sūḍigim̐ka rārā