(॥పల్లవి॥)
మాటలైనా నాడరాదా మనసిచ్చి
చోటిచ్చి పిలువరాదా చుట్టమైనవాఁడవు
(॥మాట॥)
తఱితో నీ వింతలోనే తలవంచుకుండనేల
తెఱవ నీకు మొక్కీ దీవిఁరాదా
యెఱుఁగునో నీమర్మము లేమైనా నీ కె తొల్లి
వెఱవనేఁటికి నీవు వేడుక కాఁడవు
(॥మాట॥)
వింతవా రున్నారంటా వేడుక దాఁచఁగనేల
ఇంతి బత్తిసేసీఁ జనవియ్యఁగరాదా
చెంతనుండి ఇప్పుడే సిగ్గయ్యానో నీకేమైనా
చింతించనేఁటికి సిరిగలవాఁడవు
(॥మాట॥)
తలపోసి లోలోనే తమక మఱఁపనేల
చెవియ పందెము వేసీఁ జెయ్యొగ్గరాదా
అలవేలుమంగ నేను అన్నిటా శ్రీ వేంకటేశ
కలసితి గుట్టేఁటికి కతకారివాఁడవు
(||pallavi||)
māḍalainā nāḍarādā manasichchi
soḍichchi piluvarādā suṭṭamainavām̐ḍavu
(||māḍa||)
taṟido nī viṁtalone talavaṁchuguṁḍanela
tĕṟava nīgu mŏkkī dīvim̐rādā
yĕṟum̐guno nīmarmamu lemainā nī kĕ tŏlli
vĕṟavanem̐ṭigi nīvu veḍuga kām̐ḍavu
(||māḍa||)
viṁtavā runnāraṁṭā veḍuga dām̐sam̐ganela
iṁti battisesīm̐ janaviyyam̐garādā
sĕṁtanuṁḍi ippuḍe siggayyāno nīgemainā
siṁtiṁchanem̐ṭigi sirigalavām̐ḍavu
(||māḍa||)
talabosi lolone tamaga maṟam̐panela
sĕviya paṁdĕmu vesīm̐ jĕyyŏggarādā
alavelumaṁga nenu anniḍā śhrī veṁkaḍeśha
kalasidi guṭṭem̐ṭigi kadagārivām̐ḍavu