మాటలాడించకువయ్య మగువఁ గొంతదడవు
(॥పల్లవి॥)
మాటలాడించకువయ్య మగువఁ గొంతదడవు
మేటియై యామీఁద నీతో మేలమాడీఁ గాని
(॥మాట॥)
నీ మీఁదిపదములు నెలఁతలు వాడఁగాను
కామినికి మేనెల్ల గరుపారెను
ఆ మీఁదఁ జన్నులపై హస్తము నీవు వేయఁగ
కామించి నిలువునఁ గళ దాఁకెను
(॥మాట॥)
నీవు గప్పేచంధ్ర కావి నెమ్మదిఁ బై వేసుకొని
భావించి పరవశానఁ బవళించెను
ఆవేళ నీవు విచ్చేసి అండనే పవ్వలించఁగ
చేవదేరి జలజలఁ జెమరించెను
(॥మాట॥)
పంతాన నీచేతిపూవులబంతి కన్నుల నద్దుక
పొంతనే మిక్కిలి నిట్టూర్పులు నించెను
యింతలో శ్రీ వేంకటేశ యీపెను నీవు గూడఁగ
చింత దీర నవ్వు నవ్వి సిగ్గునఁ దా నున్నది
(||pallavi||)
māḍalāḍiṁchaguvayya maguvam̐ gŏṁtadaḍavu
meḍiyai yāmīm̐da nīdo melamāḍīm̐ gāni
(||māḍa||)
nī mīm̐dibadamulu nĕlam̐talu vāḍam̐gānu
kāminigi menĕlla garubārĕnu
ā mīm̐dam̐ jannulabai hastamu nīvu veyam̐ga
kāmiṁchi niluvunam̐ gaḽa dām̐kĕnu
(||māḍa||)
nīvu gappesaṁdhra kāvi nĕmmadim̐ bai vesugŏni
bhāviṁchi paravaśhānam̐ bavaḽiṁchĕnu
āveḽa nīvu vichchesi aṁḍane pavvaliṁcham̐ga
sevaderi jalajalam̐ jĕmariṁchĕnu
(||māḍa||)
paṁtāna nīsedibūvulabaṁti kannula nadduga
pŏṁtane mikkili niṭṭūrbulu niṁchĕnu
yiṁtalo śhrī veṁkaḍeśha yībĕnu nīvu gūḍam̐ga
siṁta dīra navvu navvi siggunam̐ dā nunnadi