Maadalaadavachchumgaani mari ledanamgaraadu

మాటలాడవచ్చుఁగాని మరి లేదనఁగరాదు
Language

(॥పల్లవి॥)
మాటలాడవచ్చుఁగాని మరి లేదనఁగరాదు
సూటి దప్పకుండా నిట్టె చూచుకొమ్మీ పనులు

(॥మాట॥)
నెచ్చెలి తోడుతఁ దన నేరాలు నీవెంచఁగాను
విచ్చనవిడి నాతఁడే వింటా నున్నాఁడు
యెచ్చరించ వచ్చితి నీ కితవరి దాననై
కచ్చు పెట్టి మీఁదటెత్తు గనుకొమ్మీ యిఁకను

(॥మాట॥)
పలుమారు నందరితో పంతాలు నీవాడఁగాను
నలిరేఁగి తెరమాటుననే వున్నాఁడు
తెలిసి దాఁచఁగరాదు తెగ నీ చుట్టమ నేను
యెలమి నందుకుఁ దగ నెంచుకొమ్మీ బుద్దులు

(॥మాట॥)
ప్రమదాన నీతో నేమో పలుకుచు నుండఁగాను
తమితోడఁ బానుపుమీఁదనే వున్నాఁడు
సుముఖుఁడై యేలె నిన్నుఁజూచి శ్రీ వేంకటేశుఁడు
తెమలక విన్నవించే దిద్దుకొమ్మీ సుద్దులు

(||pallavi||)
māḍalāḍavachchum̐gāni mari ledanam̐garādu
sūḍi dappaguṁḍā niṭṭĕ sūsugŏmmī panulu

(||māḍa||)
nĕchchĕli toḍudam̐ dana nerālu nīvĕṁcham̐gānu
vichchanaviḍi nādam̐ḍe viṁṭā nunnām̐ḍu
yĕchchariṁcha vachchidi nī kidavari dānanai
kachchu pĕṭṭi mīm̐daḍĕttu ganugŏmmī yim̐kanu

(||māḍa||)
palumāru naṁdarido paṁtālu nīvāḍam̐gānu
nalirem̐gi tĕramāḍunane vunnām̐ḍu
tĕlisi dām̐sam̐garādu tĕga nī suṭṭama nenu
yĕlami naṁdugum̐ daga nĕṁchugŏmmī buddulu

(||māḍa||)
pramadāna nīdo nemo palugusu nuṁḍam̐gānu
tamidoḍam̐ bānubumīm̐dane vunnām̐ḍu
sumukhum̐ḍai yelĕ ninnum̐jūsi śhrī veṁkaḍeśhum̐ḍu
tĕmalaga vinnaviṁche diddugŏmmī suddulu