(॥పల్లవి॥)
మాటలాడఁగదె మగనితో
ఆఁటదాని కింత యమరునా
(॥॥)
చెలులు బుద్దులుచెప్పినా వినవు
చలము పతితో సాధింతురా
కలసి మెలసి కాఁపరాలు సేసి
అలుకలు మఱి యమరునా
(॥॥)
నవ్వేవిభునితో నాలేల సేసేవు
రవ్వ లింతయేలే రామలకు
జవ్వనమదాన జడయుచు నుండి
అవ్వలిమోములు అమరునా
(॥॥)
మచ్చికచుట్టాల మండాటు సేయవే
హెచ్చుఁగుందులేల యీవేళను
యిచ్చల శ్రీవేంకటేశుఁడు గూడెను
అచ్చమాయ సిగ్గు లమరునా
(||pallavi||)
māḍalāḍam̐gadĕ maganido
ām̐ṭadāni kiṁta yamarunā
(||||)
sĕlulu buddulusĕppinā vinavu
salamu padido sādhiṁturā
kalasi mĕlasi kām̐parālu sesi
alugalu maṟi yamarunā
(||||)
navvevibhunido nālela sesevu
ravva liṁtayele rāmalagu
javvanamadāna jaḍayusu nuṁḍi
avvalimomulu amarunā
(||||)
machchigasuṭṭāla maṁḍāḍu seyave
hĕchchum̐guṁdulela yīveḽanu
yichchala śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕnu
achchamāya siggu lamarunā