Maadalaadamboyi seli mamdamiriyaalu salle

మాటలాడఁబోయి చెలి మందమిరియాలు చల్లె
Language

(॥పల్లవి॥)
మాటలాడఁబోయి చెలి మందమిరియాలు చల్లె
నీటుగాదు మేటిగాదు నీకే పోదయ్యా

(॥మాట॥)
చూపులఁ గొసరబోయి సోయగాన జంకించె
కోపము నిలుపలేక కోమలి నిన్ను
కోపుల సవ్వఁగఁబో ఇ గుంపించె కాఁకలెల్ల
యీపడఁతి కన్నె ఇంతె యెగ్గునకువయ్యా

(॥మాట॥)
తగులనాడఁగబోయి తప్పులెంచీ నీమీఁద
అగడైన విరహాగ్ని నాఁపఁగలేక
మొగము చూడఁగబోయి మొక్కె నొకచేత నీకు
ఇగురుఁబోఁడిభావ మియ్యకొనవయ్యా

(॥మాట॥)
సరసమాఁడఁగఁబోయి సరుగ నీకాలు దొక్కె
ఇరవైన శ్రీవేంకటేశుఁడ నేఁడు
కరఁగి కూడఁగబోఇ కాఁగిటిలో నిన్ను మెచ్చె
తరుని ఇట్టె నీకుఁదగుఁగదవయ్యా

(||pallavi||)
māḍalāḍam̐boyi sĕli maṁdamiriyālu sallĕ
nīḍugādu meḍigādu nīge podayyā

(||māḍa||)
sūbulam̐ gŏsaraboyi soyagāna jaṁkiṁchĕ
kobamu nilubalega komali ninnu
kobula savvam̐gam̐bo i guṁpiṁchĕ kām̐kalĕlla
yībaḍam̐ti kannĕ iṁtĕ yĕggunaguvayyā

(||māḍa||)
tagulanāḍam̐gaboyi tappulĕṁchī nīmīm̐da
agaḍaina virahāgni nām̐pam̐galega
mŏgamu sūḍam̐gaboyi mŏkkĕ nŏgaseda nīgu
igurum̐bom̐ḍibhāva miyyagŏnavayyā

(||māḍa||)
sarasamām̐ḍam̐gam̐boyi saruga nīgālu dŏkkĕ
iravaina śhrīveṁkaḍeśhum̐ḍa nem̐ḍu
karam̐gi kūḍam̐gaboi kām̐giḍilo ninnu mĕchchĕ
taruni iṭṭĕ nīgum̐dagum̐gadavayyā