మాటకు మునుపనే మంకు లేఁటికి
(॥పల్లవి॥)
మాటకు మునుపనే మంకు లేఁటికి
కాటుకకన్నులఁ జూచి ఘాతసేయరాదా
(॥మాట॥)
వినరాదా ఆమాట విభునిమోము చూచి
అనక తొలుతే వోప ననవలెనా
తనువు లంటినమీఁదఁ దలఁపునఁ గలవెల్ల
చనుమొన లటు చూపి సాదించరాదా
(॥మాట॥)
గుట్టుతో నుండఁగరాదా గురిగా నిన్నాతఁడు
పట్టకముందే పెనఁగఁ బాడి యవునా
నెట్టుకిన్న మీఁదటను నేరము లేమి గల్లాను
మెట్టి పట్టి రతులలో మెరయఁగ రాదా
(॥మాట॥)
చక్కనుండరాదా సారె శ్రీవేంకటేశుఁడు
మొక్కకతొలుతే నీకు మొక్కనేఁటికి
యిక్కువ లంటి యాతఁడు ఇట్టె నిన్నుఁగలసె
మక్కువ చల్లినంతనే మన్నించరాదా
(||pallavi||)
māḍagu munubane maṁku lem̐ṭigi
kāḍugagannulam̐ jūsi ghādaseyarādā
(||māḍa||)
vinarādā āmāḍa vibhunimomu sūsi
anaga tŏlude voba nanavalĕnā
tanuvu laṁṭinamīm̐dam̐ dalam̐punam̐ galavĕlla
sanumŏna laḍu sūbi sādiṁcharādā
(||māḍa||)
guṭṭudo nuṁḍam̐garādā gurigā ninnādam̐ḍu
paṭṭagamuṁde pĕnam̐gam̐ bāḍi yavunā
nĕṭṭuginna mīm̐daḍanu neramu lemi gallānu
mĕṭṭi paṭṭi radulalo mĕrayam̐ga rādā
(||māḍa||)
sakkanuṁḍarādā sārĕ śhrīveṁkaḍeśhum̐ḍu
mŏkkagadŏlude nīgu mŏkkanem̐ṭigi
yikkuva laṁṭi yādam̐ḍu iṭṭĕ ninnum̐galasĕ
makkuva sallinaṁtane manniṁcharādā