Maabudaamkaa vattimaadalemidigi nimka

మాపుదాఁకా వట్టిమాటలేమిటికి నిఁక
Language

(॥పల్లవి॥)
మాపుదాఁకా వట్టిమాటలేమిటికి నిఁక
తీపులకుఁ గుఱి మోవి దిష్టంబులే

(॥మాపు॥)
తలపోఁతలకును గుఱి తమకంబులే చెలియ
వలపులకు గుఱి నిండు వయసు మదమే
చలములకు గుఱి తగిన సమరతుల నిబ్బరము
పిలుపులకు గుఱి మంచి ప్రియములివియే

(॥మాపు॥)
యెనయు నాసలకు గుఱి యెడతాఁకులే చెలియ
ననుపులకు గుఱి సెలవినవ్వులివియే
చనవులకు గుఱి మిగుల సలిగెలు మెరయుటలు
మొనయ పొందులకు గుఱి మొగమోటలే

(॥మాపు॥)
జిగిఁ గలయికలకు గుఱి సిగ్గు విడుచుటె చెలియ
తగులమికి గుఱి యేకతములవునికే
తగిన శ్రీ వేంకటోత్తముఁడు ననునిటు గూడె
పొగరుమన్ననకు గుఱి భోగంబులే

(||pallavi||)
mābudām̐kā vaṭṭimāḍalemiḍigi nim̐ka
tībulagum̐ guṟi movi diṣhṭaṁbule

(||mābu||)
talabom̐talagunu guṟi tamagaṁbule sĕliya
valabulagu guṟi niṁḍu vayasu madame
salamulagu guṟi tagina samaradula nibbaramu
pilubulagu guṟi maṁchi priyamuliviye

(||mābu||)
yĕnayu nāsalagu guṟi yĕḍadām̐kule sĕliya
nanubulagu guṟi sĕlavinavvuliviye
sanavulagu guṟi migula saligĕlu mĕrayuḍalu
mŏnaya pŏṁdulagu guṟi mŏgamoḍale

(||mābu||)
jigim̐ galayigalagu guṟi siggu viḍusuḍĕ sĕliya
tagulamigi guṟi yegadamulavunige
tagina śhrī veṁkaḍottamum̐ḍu nanuniḍu gūḍĕ
pŏgarumannanagu guṟi bhogaṁbule