Maabudaamkaa nodambaadumaadalu gaddaa

మాపుదాఁకా నొడఁబాటుమాటలు గద్దా
Language

(॥పల్లవి॥)
మాపుదాఁకా నొడఁబాటుమాటలు గద్దా
యీపని తొల్లే తానెఱుఁగు రమ్మనవే

(॥॥)
కూరిమిగలుగుచోట కోప మేమిసేయునే
నేరిచినవారికి నేరమేడదే
ఆరితేరినపొందులు ఐతే వేసటెక్కడిదే
ఆరజము సేయ కింటి కాతని రమ్మనవే

(॥॥)
వేడుకలే సతమైతే విసువు లెందుండునే
పాడితో నడచితేను భయమేఁటికే
వాడికైతే వలపులు వద్దంటే మానునా
యేడసుద్దులు చెప్పీని ఇంటికి రమ్మనవే

(॥॥)
చేతికిలోనై వుండఁ గా చేసన్న లమరునా
కాతరమే కలిగితేఁ గసటు లేదు
యేతుల శ్రీవేంకటేశుఁ డిప్పు డిట్టె నన్ను నేలె
యీతగవు తా నడపె నింటికి రమ్మనవే

(||pallavi||)
mābudām̐kā nŏḍam̐bāḍumāḍalu gaddā
yībani tŏlle tānĕṟum̐gu rammanave

(||||)
kūrimigalugusoḍa koba memiseyune
nerisinavārigi nerameḍade
āriderinabŏṁdulu aide vesaḍĕkkaḍide
ārajamu seya kiṁṭi kādani rammanave

(||||)
veḍugale sadamaide visuvu lĕṁduṁḍune
pāḍido naḍasidenu bhayamem̐ṭige
vāḍigaide valabulu vaddaṁṭe mānunā
yeḍasuddulu sĕppīni iṁṭigi rammanave

(||||)
sedigilonai vuṁḍam̐ gā sesanna lamarunā
kādarame kaligidem̐ gasaḍu ledu
yedula śhrīveṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ nannu nelĕ
yīdagavu tā naḍabĕ niṁṭigi rammanave