మాపు దాఁకా యేమనిన మంకుదేరేవా
(॥పల్లవి॥)
మాపు దాఁకా యేమనిన మంకుదేరేవా
తీపులు చల్లుక నీతో దెగడేదే నా పని
(॥వప॥)
చలము సాదించరాదు సణగులఁ దిట్టిరాదు
వలచినదాన నిన్ను వంచుకోరాదు
తెలివి దెచ్చుక నీతో తేటలుగా నవ్వునవ్వి
కెలసి ఇచ్చకమాడి గెలిచేదే నాపని
(॥వప॥)
పెనఁగఁ దగదు నీతో బిగువు చూపఁదగదు
నవిచినదాన నీతో నాలి దగదు
మనసువట్టుక నీమర్మములు సోఁకించి
చనవు సేసుకుండేది సంగతైన నాపని
(॥వప॥)
పొందుసేయ కిఁకఁ బోదు బోగించి మెచ్చకపోదు
విందువంటిదాన మాట వినకపోదు
కందువతోడుత శ్రీ వేంకటేశ నేఁ గూడితి
యిందునే పాయకవుండి యెనసేదే నాపని
(||pallavi||)
mābu dām̐kā yemanina maṁkuderevā
tībulu salluga nīdo dĕgaḍede nā pani
(||vaba||)
salamu sādiṁcharādu saṇagulam̐ diṭṭirādu
valasinadāna ninnu vaṁchugorādu
tĕlivi dĕchchuga nīdo teḍalugā navvunavvi
kĕlasi ichchagamāḍi gĕlisede nābani
(||vaba||)
pĕnam̐gam̐ dagadu nīdo biguvu sūbam̐dagadu
navisinadāna nīdo nāli dagadu
manasuvaṭṭuga nīmarmamulu som̐kiṁchi
sanavu sesuguṁḍedi saṁgadaina nābani
(||vaba||)
pŏṁduseya kim̐kam̐ bodu bogiṁchi mĕchchagabodu
viṁduvaṁṭidāna māḍa vinagabodu
kaṁduvadoḍuda śhrī veṁkaḍeśha nem̐ gūḍidi
yiṁdune pāyagavuṁḍi yĕnasede nābani