మాపు దాఁకా విన్నపాలు మరియేఁటికి
(॥పల్లవి॥)
మాపు దాఁకా విన్నపాలు మరియేఁటికి
పైపై నీదేవులౌటే భాగ్యమింతేకాక
(॥మాపు॥)
వలచినకాంత యీకె వాసు లెంచఁబనిలేదు
చెలరేఁగి వినయము చేసుటగాని
నిలువెల్లా దమకమే నీతో నెట్టలిగీని
కలది నీవూడిగమే గతి ఇంతేకాక
(॥మాపు॥)
తగువైనసతి యీకె తప్పులు వట్టంగరదు
అగపడి ఇచ్చకము లాడుటగాని
మొగమోట దరచాయ మొక్కలాన దూరలేదు
నిగిడి నీతో నవ్వుటే నేరు పింతేకాని
(॥మాపు॥)
కూడినమానిని యీపె గుంపెనలు చూపరాదు
వేడుకఁ గాఁగిలిమ్మని వేఁడుటగాని
యీడనె శ్రీవేంకటేశ యేలితివి నిన్నేమని
జాడతోడ మోవేనుటే సరవితేకాక
(||pallavi||)
mābu dām̐kā vinnabālu mariyem̐ṭigi
paibai nīdevulauḍe bhāgyamiṁtegāga
(||mābu||)
valasinagāṁta yīgĕ vāsu lĕṁcham̐baniledu
sĕlarem̐gi vinayamu sesuḍagāni
niluvĕllā damagame nīdo nĕṭṭaligīni
kaladi nīvūḍigame gadi iṁtegāga
(||mābu||)
taguvainasadi yīgĕ tappulu vaṭṭaṁgaradu
agabaḍi ichchagamu lāḍuḍagāni
mŏgamoḍa darasāya mŏkkalāna dūraledu
nigiḍi nīdo navvuḍe neru piṁtegāni
(||mābu||)
kūḍinamānini yībĕ guṁpĕnalu sūbarādu
veḍugam̐ gām̐gilimmani vem̐ḍuḍagāni
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi ninnemani
jāḍadoḍa movenuḍe saravidegāga