Maabu daamkaa vattijoli maado nemtigi

మాపు దాఁకా వట్టిజోలి మాతో నేఁటికి
Language

(॥పల్లవి॥)
మాపు దాఁకా వట్టిజోలి మాతో నేఁటికి
నీ పొందుల కిది వలె నేరుచుకోవయ్యా

(॥మాపు॥)
తెగరాని మాఁటలకు తెరువు కోపగించుట
నగితేనే పెనగొను నాలితనము
మొగము చూచితేనే మోహములెల్లా నిండు
నిగిడి నీకేది వలె నేరుచుకోవయ్యా

(॥మాపు॥)
తీరనియలుకలకు తెరఁగు పంతమిచ్చుట
వూరకుండితేనే నాయ ముమ్మళినుండు
కూరిమి గొసరితేనే కుప్పవడు వలపులు
నీరచన కేది వలె నేరుచుకోవయ్యా

(॥మాపు॥)
పట్టినవాలములకు పరిహరము మొక్కుటే
గుట్టుతో నుంటే నన్నీఁ గొనసాగును
ఇట్టె శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
నెట్టన నీ కేది వలె నేరుచుకోవయ్యా

(||pallavi||)
mābu dām̐kā vaṭṭijoli mādo nem̐ṭigi
nī pŏṁdula kidi valĕ nerusugovayyā

(||mābu||)
tĕgarāni mām̐ṭalagu tĕruvu kobagiṁchuḍa
nagidene pĕnagŏnu nālidanamu
mŏgamu sūsidene mohamulĕllā niṁḍu
nigiḍi nīgedi valĕ nerusugovayyā

(||mābu||)
tīraniyalugalagu tĕram̐gu paṁtamichchuḍa
vūraguṁḍidene nāya mummaḽinuṁḍu
kūrimi gŏsaridene kuppavaḍu valabulu
nīrasana kedi valĕ nerusugovayyā

(||mābu||)
paṭṭinavālamulagu pariharamu mŏkkuḍe
guṭṭudo nuṁṭe nannīm̐ gŏnasāgunu
iṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
nĕṭṭana nī kedi valĕ nerusugovayyā