Maabu daamkaa rebagaada maayalela

మాపు దాఁకా రేపకాడ మాయలేల
Language

(॥పల్లవి॥)
మాపు దాఁకా రేపకాడ మాయలేల
తీపు చేఁదుఁ గలపితే తినఁ జవులవునా

(॥వప॥)
నిద్దురకన్ను లతోడ నీవు మాటలాడనేల
పొద్దునఁ బవ్వళింతువు పోరాదా
అద్దో దిట్టకూళతనమప్పటిని నెరుపేవు
గద్దించి యెంతచూచినఁ గల్ల నిజమౌనా

(॥వప॥)
యెక్కడో పరాకుతోడనీడ నాతో నవ్వనేల
మక్కువగల చోటికే మగుడరాదా
పుక్కటవలపుతోడి పూసగొండి తనమేల
పక్కన మొఱఁగితేను పగలు రేయౌనా

(॥వప॥)
అసురుసురులతోడ ఆయములంటఁగనేల
కొసరు దీరఁగ నన్నుఁ గూడఁగరాదా
పొసఁగ శ్రీవేంకటేశ భోగించితివిదె నన్ను
యెఁగ నీళ్లడిచితే నెప్పుడు రెండౌనా

(||pallavi||)
mābu dām̐kā rebagāḍa māyalela
tību sem̐dum̐ galabide tinam̐ javulavunā

(||vaba||)
nidduragannu ladoḍa nīvu māḍalāḍanela
pŏddunam̐ bavvaḽiṁtuvu porādā
addo diṭṭagūḽadanamappaḍini nĕrubevu
gaddiṁchi yĕṁtasūsinam̐ galla nijamaunā

(||vaba||)
yĕkkaḍo parāgudoḍanīḍa nādo navvanela
makkuvagala soḍige maguḍarādā
pukkaḍavalabudoḍi pūsagŏṁḍi tanamela
pakkana mŏṟam̐gidenu pagalu reyaunā

(||vaba||)
asurusuruladoḍa āyamulaṁṭam̐ganela
kŏsaru dīram̐ga nannum̐ gūḍam̐garādā
pŏsam̐ga śhrīveṁkaḍeśha bhogiṁchidividĕ nannu
yĕm̐ga nīḽlaḍiside nĕppuḍu rĕṁḍaunā